AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1000 మందితో ఆ చాటింగ్.. సకల కళా వల్లభుడు ఈ పవన్ కుమార్

1000 మందితో ఆ చాటింగ్.. సకల కళా వల్లభుడు ఈ పవన్ కుమార్

Phani CH
|

Updated on: Oct 20, 2026 | 4:38 PM

Share

హైదరాబాద్‌లో వెలుగుచూసిన హనీట్రాప్ కేసులో కొండబట్ల పవన్ కుమార్ అనే యువకుడు ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లతో వందలాది మందిని ట్రాప్ చేసి, ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేశాడు. డాక్టర్లు, వ్యాపారులు సహా పలువురు బాధితులు కాగా, పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసులో కొండబట్ల పవన్ కుమార్ అనే యువకుడు అరెస్ట్ అయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పవన్ కుమార్, ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లతో అమాయకులను లక్ష్యంగా చేసుకున్నాడు. ముఖ్యంగా కోల్‌కతాకు చెందిన ఓ మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫోటోలను ఉపయోగించి చందన పేరుతో అమ్మాయిలా పరిచయం చేసుకునేవాడు. బాధితులతో కొంతకాలం చాటింగ్ చేసి నమ్మకం కుదుర్చుకున్నాక, శృంగార చాటింగ్‌లు చేసేవాడు. అనంతరం వారి ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు సేకరించి, వాటితో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవాడు. తాను ఆ అమ్మాయి సోదరుడినని పరిచయం చేసుకుని, బాధితులను మానసికంగా భయపెట్టి, లక్షల రూపాయలు డిమాండ్ చేసేవాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని కూడా బెదిరించినట్లు తేలింది. పవన్ కుమార్ 13 ఫేక్ ఇన్‌స్టాగ్రామ్, 14 ఫేస్‌బుక్ అకౌంట్లను ఉపయోగించి 1000 మందికి పైగా చాట్ చేశాడు. వీరిలో 82 మంది ప్రైవేట్ ఫోటోలు, వీడియోలను అతను తన పెన్‌డ్రైవ్‌లో దాచి ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. డాక్టర్లు, వ్యాపారులు, ఉద్యోగులు, లెక్చరర్లు, డెలివరీ పార్ట్‌నర్లు, ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందిన వ్యక్తులు కూడా అతని వలలో చిక్కుకున్నారు. మొత్తంగా రూ. 25 లక్షలు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. సైదాబాద్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో పవన్ కుమార్‌ను అరెస్ట్ చేసి, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్ పరిచయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నీరు వృథా చేస్తే భారీగా ఫైన్.. కరెంట్, వాటర్ కష్టాలకు చెక్ పెట్టేదెలా?

ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. ఒకేసారి ఖాతాల్లోకి రూ.6,000 జమ!

టీటీడీ కీలక నిర్ణయం! తిరుమలలో ఏఐ టెక్నాలజీతో ఉద్యానవనాల అభివృద్ధి

వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన.. కంటిలో పెరిగిన పన్ను!

డ్రైవర్ లేకుండానే రివర్స్‌లో దూసుకెళ్లిన కారు..

Follow Us