AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు తెలియకుండా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కట్ అయ్యాయా..? ఇలా చేస్తే రీఫండ్ పొందవచ్చు.. అస్సలు మిస్సవ్వకండి..

మీకు తెలియకుండా బ్యాంక్ నుంచి డబ్బులు కట్ అయ్యాయా.. సైబర్ మోసానికి మీరు గురయ్యారా.. అయితే కొన్న పరిస్థితుల్లో మీరు బ్యాంక్ నుంచి పూర్తి రీఫండ్ పొందవచ్చు. ఈ మేరకు ఆర్బీఐ కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. మీరు సైబర్ మోసానికి గురైనప్పుడు ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దాం.

మీకు తెలియకుండా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కట్ అయ్యాయా..? ఇలా చేస్తే రీఫండ్ పొందవచ్చు.. అస్సలు మిస్సవ్వకండి..
Bank Account
Venkatrao Lella
|

Updated on: Oct 20, 2026 | 9:07 PM

Share

ప్రస్తుతం సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మనకు తెలియకుండానే బ్యాంక్ అకౌంట్లోని సొమ్మును వివిధ పద్దతుల ద్వారా సైబర్ మోసగాళ్లు కాజేస్తున్నారు. స్పామ్ లింక్స్, మాల్ వేర్ల ద్వారా బ్యాంక్ ఓటీపీలు తెలుసుకుని ఖాతా ఖాళీ చేస్తున్నారు. మన అకౌంట్‌ నుంచి డబ్బులు డెబిట్ అయినట్లు మెస్సేజ్ వస్తే కానీ సైబర్ మోసానికి గురైనట్లు మనకు తెలియదు. మీ ప్రమేయం లేకుండా మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినట్లు మెస్సేజ్ వస్తే వెంటనే అప్రమత్తం అవ్వాలి. కొన్ని పరిస్థితుల్లో మీరు కోల్పోయిన సొమ్మను తిరిగి రాబట్టుకోవచ్చు. అయితే మోసం జరిగిన తీరును బట్టి ఇది ఉంటుంది. మీ తప్పిదం వల్ల జరిగితే బ్యాంకులు ఏమీ చేయలేదు. మీరే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. బ్యాంక్ తప్పిదం వల్ల జరిగితే మీకు పూర్తి రీఫండ్ అందుతుంది. ఇటీవల సైబర్ మోసాలు ఎక్కువగా జరుగుతున్న క్రమంలో రీఫండ్‌కు సంబంధించి ఆర్బీఐ కొన్ని రూల్స్ ప్రవేశపెట్టింది.

రీఫండ్ మీకు లభిస్తుందా..?

ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంక్ తప్పిదం వల్ల వినియోగదారుడు నగదు కోల్పోతే బ్యాంక్ పూర్తి రీఫండ్ అందించాల్సి ఉంటుంది. మీ ఖాతా నుంచి డబ్బులు పోయినప్పుడు ముందుగా మోసం ఎలా జరిగిందో తెలుసుకోండి. అనంతరం బ్యాంక్ సిబ్బందిని సంప్రదించి ఫ్రాడ్ జరిగినట్లు ఫిర్యాదు చేయండి. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఇతర లావాదేవీలు, యూపీఐ చెల్లింపులు జరగకుండా నిలిపివేయని కోరండి. లావాదేవీ ఐడీ, మోసం జరిగిన తేదీ, జరిగిన లావాదేవీలకు సంబంధించిన రికార్డులను భద్రపర్చుకోండి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930కి కంప్లైంట్ చేయండి. బ్యాంక్ వ్యవస్థలోని లోపం కారణంగా మీరు డబ్బులు కోల్పోయినట్లయితే.. బ్యాంక్‌నే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ధర్డ్ పార్టీ భద్రతా ఉల్లంఘన వల్ల నష్టం జరిగితే 3 రోజుల్లోపు వినియోగదారుడు ఫిర్యాదు చేయాలి. ఇలాంటప్పుడు కూడా మీరు రీఫండ్ పొందవచ్చు.

రీఫండ్ ఎలా అందుతుంది..?

బ్యాంక్ తప్పిదం వల్ల జరిగితే 10 రోజుల్లోపు షాడో రివర్సల్ విధానం ద్వారా వినియోగదారుడికి రీఫండ్ చేయాలి. అలాగే మోసంపై బ్యాంక్ దర్యాప్తు కొనసాగించాలి. మీరు 4 నుంచి 7 పనిదినాల్లోపు ఫిర్యాదు చేస్తే రీఫండ్ అనేది ఆర్బీఐ నిర్దేశించి విధానం ద్వారా జరుగుతుంది. ఇక ఏడు రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తే వాపస్ బ్యాంక్ విధానంపై ఆధారపడి ఉంటుంది. దీంతో మోసం ఎలా జరిగినా సరే మీరు ఫిర్యాదు చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీలైనంత త్వరగా ఫిర్యాదు చేయడం వల్ల మీకు వెంటనే రీఫండ్ అందే అవకాశం ఉంటుంది. అలాగే మీ కేసును బ్యాంక్ త్వరగా పరిష్కరించే ఛాన్స్ ఉంటుంది. ఫిర్యాదు చేయడంలో ఆలస్యం చేస్తే రీఫండ్ అందకపోవచ్చు.

Follow Us