Teja Sajja: ఓ ఇంటివాడు కాబోతున్న తేజ సజ్జా.. డిసెంబర్‌లోనే గ్రాండ్ వెడ్డింగ్.. అమ్మాయి ఎవరంటే?
హనుమాన్, మిరాయ్ సినిమాలతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు తేజ సజ్జా. ఇప్పుడు హోస్ట్ గానూ అలరిస్తున్నాడీ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో. ఇదిలా ఉంటే ప్రస్తుతం సినిమాలు, టాక్ షోలతో బిజీగా ఉంటోన్న తేజ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడని తెలుస్తోంది.

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో తేజ సజ్జా త్వరలోనే ఓ ఇంటివాడు కానున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన ఈ హీరో సింగిల్ లైఫ్ కు బైబై చెప్పి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నాడని వార్తలు వస్తున్నాయి. నవంబర్ లో ఈ హీరో నిశ్చితార్థం జరగనున్నట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. అనంతరం డిసెంబర్ లో రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ వేదికగా అత్యంత సన్నిహితులు, స్నేహితుల మధ్య వివాహం జరగనుందట. త్వరలోనే తేజ సజ్జానే స్వయంగా ఈ శుభవార్తను అభిమానులతో పంచుకోనున్నారట. ఇక తేజ సజ్జా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధంలేదని తెలుస్తోంది. వీరి వివాహం పెద్దలు కుదుర్చున వివాహమని టాక్. ఇక తేజ సజ్జాకు కాబోయే భార్య సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం తేజ పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ గా మారాయి. సినీ అభిమానులు, నెటిజన్లు ఈ యంగ్ హీరోకు ముందస్తుగా అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కాగా ఛైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించాడు తేజ సజ్జా. చిన్నతనంలోనే మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి స్టార్స్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఇక ఓ బేబీ, జాంబిరెడ్డి, ఇష్క్, అద్బుతం తదితర సినిమాలతో హీరోగానూ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా నటించిన హనుమాన్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రంతోనే తేజకు నేషనల్ వైడ్ గా గుర్తింపు వచ్చింది. దీని తర్వాత వచ్చిన మిరాయ్ కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం జాంబిరెడ్డి నెక్ట్స్ లెవెల్ సినిమాతో పాటు మరికొన్ని ప్రాజెక్టుల్లోనూ నటిస్తున్నాడు తేజ. ఓవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు ది ట్రైటర్స్ అనే రియాలిటీ షోకి హోస్ట్ గా కొనసాగుతున్నాడీ యంగ్ హీరో. ప్రస్తుతం ఈ రియాలిటీ షో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




