AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ పప్పి ఏం చెబుతుందో వినండి.. పెంపుడు జంతువుల మనసులోని మాట చెప్పే AI డివైస్ వచ్చేసింది!

మీ ఇంట్లోని కుక్క లేదా పిల్లి మొరుగుతున్నప్పుడు లేదా అరుస్తున్నప్పుడు అవి ఏం చెప్పాలనుకుంటున్నాయో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారా? పెంపుడు జంతువుల భావాలను సులభంగా అర్థం చేసుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఒక వినూత్న పరికరం అందుబాటులోకి వచ్చింది. PettiChat పేరిట విడుదలైన ఈ గ్యాడ్జెట్ ప్రస్తుతం టెక్ ప్రియులతో పాటు పెంపుడు జంతువుల ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అసలేంటి ఈ పెట్టిచాట్..? ఎలా పనిచేస్తుంది..?

మీ పప్పి ఏం చెబుతుందో వినండి.. పెంపుడు జంతువుల మనసులోని మాట చెప్పే AI డివైస్ వచ్చేసింది!
Pet Communication Device
Jyothi Gadda
|

Updated on: Aug 21, 2026 | 5:14 PM

Share

యానిమల్‌ లవర్స్‌ చాలా మంది ఉంటారు. అయితే, పెంపుడు జంతువులు అరవడం, మొరగడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాయో అర్థం కాక, ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. కొన్ని సార్లు అవి ఆగకుండా మొరుగుతాయి. కొన్ని సార్లు ఇంటి ముందుకి ఎవరైనా వస్తే.. తలుపు దగ్గర నిలబడతాయి. మరికొన్ని సార్లు ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా శబ్ధాలు చేస్తాయి. ఇలాంటి పరిస్థితిలో వాటి శబ్ధాల అర్థాన్ని తెలుసుకోవడానికి ఒక పరికరం ఉంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. కానీ, ఇది నిజంగానే నిజమయ్యే టైమ్‌ వచ్చింది. పెంపుడు కుక్కల అనువాదకుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాడు.. పూర్తి వివరాల్లోకి వెళితే..

PettiChat ఎలా పనిచేస్తుంది?:

ఈ పరికరం కేవలం 27.2 గ్రాముల తేలికపాటి బరువుతో ఉంటుంది. దీనిని కుక్కలు లేదా పిల్లుల మెడలో వేసే బెల్ట్ కు సులభంగా క్లిప్ చేయవచ్చు. ఇందులో ఉన్న మైక్రోఫోన్లు జంతువుల శబ్దాలను సేకరిస్తే, మోషన్ సెన్సార్లు వాటి శరీర కదలికలను ట్రాక్ చేస్తాయి. ఈ డేటాను AI మోడల్ విశ్లేషించి, జంతువులకు ఆకలిగా ఉందా, భయపడుతున్నాయా లేదా సంతోషంగా ఉన్నాయా అనే విషయాలను కేవలం 1.2 సెకన్లలో యజమాని స్మార్ట్‌ఫోన్ యాప్‌కు సందేశం రూపంలో పంపుతుంది.

ఇవి కూడా చదవండి

కీలక ఫీచర్లు, విశేషాలు:

ఇది జంతువుల శబ్దాలను మానవ భాషలోకి మార్చడమే కాకుండా, యజమాని మాట్లాడే మాటలను జంతువులకు అర్థమయ్యే ధ్వని తరంగాల రూపంలోకి మారుస్తుంది. లక్షలాది జంతువుల శబ్దాల డేటా ఆధారంగా శిక్షణ పొందిన ఈ AI పరికరం 94.6శాతం వరకు సరైన అనువాదాన్ని అందిస్తుందని తయారీదారులు పేర్కొన్నారు. ఇందులో ఉన్న జిపిఎస్ సెన్సార్ ద్వారా పెంపుడు జంతువు ఎక్కడ ఉందో ట్రాక్ చేయవచ్చు. అలాగే వాటి ఆరోగ్య స్థితి, నిద్ర, ప్రవర్తన తీరును కూడా ఈ డివైస్ పర్యవేక్షిస్తుంది.

వీడియో ఇక్కడ చూడండి..

View this post on Instagram

A post shared by Beebom (@beebomco)

మార్కెట్లో సంచలనం:

ఈ డివైస్ మార్కెట్లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే వేలాది సంఖ్యలో ప్రీ-ఆర్డర్లు సాధించి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. సాంకేతిక పరిజ్ఞానంతో పెంపుడు జంతువులు, యజమానుల మధ్య అనుబంధాన్ని మరింత పెంచేందుకు ఈ గ్యాడ్జెట్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మీ పప్పి ఏం చెబుతుందో వినండి.. పెంపుడు జంతువుల మనసులోని మాటలు
మీ పప్పి ఏం చెబుతుందో వినండి.. పెంపుడు జంతువుల మనసులోని మాటలు
జ్యోతిష్య ప్రకారం ఈ 4 రాశుల మహిళలు భర్తకు ఎప్పుడూ అండగా ఉంటారట!
జ్యోతిష్య ప్రకారం ఈ 4 రాశుల మహిళలు భర్తకు ఎప్పుడూ అండగా ఉంటారట!
20 ఏళ్ల Home Loan 12 ఏళ్లలో ఎలా తీర్చాలి? ఈ ట్రిక్స్‌ పాటిస్తే..
20 ఏళ్ల Home Loan 12 ఏళ్లలో ఎలా తీర్చాలి? ఈ ట్రిక్స్‌ పాటిస్తే..
దేశవాళీలో 4245 పరుగులు, 470 వికెట్లు.. భారత్ తరపున 2 టెస్ట్‌లే
దేశవాళీలో 4245 పరుగులు, 470 వికెట్లు.. భారత్ తరపున 2 టెస్ట్‌లే
పూజలో దేవుడి ముందు ఎన్ని అగరబత్తులు వెలిగించాలి?
పూజలో దేవుడి ముందు ఎన్ని అగరబత్తులు వెలిగించాలి?
ఒకే టైమ్‌లో రెండు యోగాలు.. ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టే రాశులివే..
ఒకే టైమ్‌లో రెండు యోగాలు.. ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టే రాశులివే..
రైలు కిటికీ దగ్గర కూర్చొని ఫోన్ పట్టుకుంటున్నారా? జాగ్రత్త..!
రైలు కిటికీ దగ్గర కూర్చొని ఫోన్ పట్టుకుంటున్నారా? జాగ్రత్త..!
గోవా టూర్: హైదరాబాద్ నుంచి విమానంలో.. 4 రోజులు, 3 రాత్రుల ట్రిప్‌
గోవా టూర్: హైదరాబాద్ నుంచి విమానంలో.. 4 రోజులు, 3 రాత్రుల ట్రిప్‌
సంజీవ్ సినిమా రివ్యూ.. ప్రతి కుర్రాడి మనసును తాకే మూవీ..
సంజీవ్ సినిమా రివ్యూ.. ప్రతి కుర్రాడి మనసును తాకే మూవీ..
కరెంట్ పోయినా ఫ్యాన్ ఆగదు..హైబ్రిడ్ సీలింగ్ ఫ్యాన్ గురించి తెలుసా
కరెంట్ పోయినా ఫ్యాన్ ఆగదు..హైబ్రిడ్ సీలింగ్ ఫ్యాన్ గురించి తెలుసా