నూనెతో పనిలేదు.. ఈ సింపుల్ చిట్కాతో ఈజీగా అప్పడాలు వేయించండి
28 Sep 2026
Anand T
మన భారతీయ వంటకాల్లో భోజనంలోకి అప్పడాలు కచ్చితంగా ఉండాల్సిందే. అయితే వీటిని నూనెతో వేయిస్తారు కాబట్టి చాలా మంది తినేందుకు వెనకాడుతారు.
ఆయిల్ ఫ్రీ అప్పడాలు
కానీ కొన్ని సింపుల్ చిట్కాలతు తెలిస్తే.. మీరు నూనెతో పనిలేకుండానే ఆయిల్ ఫ్రీ అప్పడాలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
అప్పడాలు
మీరు ఆయిల్ ఫ్రీ అప్పడాలు చేసుకునేందుకు ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటను తక్కువలో ఉంచండి.
అప్పడాలు
ఇప్పడు పటకార సహాయంతో అప్పడాన్ని పట్టుకుని, మంటపై కొద్దిగా ఎత్తులో ఉంచి అటూ ఇటూ వేగంగా తిప్పుతూ కాల్చండి. అంతే అది క్షణాల్లో కరకరలాడే అప్పడంగా మాడుతుంది.
అప్పడాలు
మరో పద్దతి ఏంటంటే స్టవ్ మీద చపాతీ లేదా దోశల పెనం పెట్టి బాగా వేడి చేయండి. దానిపై అప్పడం పెట్టి రైండ్‌గా తిప్పుతూ శుభ్రమైన క్లాత్‌తో మెత్తగా ప్రెస్ చేయండి.
అప్పడాలు
ఇలా చేయడం వల్ల అప్పడం ముడుచుకుపోకుండా సమతలంగా కాలుతుంది. అయిల్ లేకుండా అప్పడం పొంగుతుంది.
అప్పడాలు
ఎయిర్ ఫ్రైయర్‌తో కూడా మీరు అప్పడాలు వేయించవచ్చు, ఇందుకోసం ఎయిర్ ఫ్రైయర్ 200°C వద్ద ప్రీ-హీట్ చేయండి.
అప్పడాలు
అప్పడాన్ని బాస్కెట్‌లో ఉంచి సుమారు 1 నుండి 2 నిమిషాల పాటు ఉంచండి. గాలికి అప్పడం ఎగరకుండా ఉండేందుకు దానిపై చిన్న స్టీల్ చెంచా ఉంచడం మంచిది.
అప్పడాలు
మరో మార్గం మైక్రోవేవ్ సేఫ్ ప్లేట్ అప్పడాన్ని ఉంచి దాన్ని 30 నుండి 40 సెకన్ల పాటు అటు ఇటూ తిప్పుతూ మైక్రోవేవ్ చేయండి. అంతే అయిల్ లేకుండానే మీకు కరకరలాగే అప్పడాలు రెడీ.