ఆ విషయంలో సల్మాన్, విజయ్ రికార్డులను బ్రేక్ చేసిన శ్రీలీల

28  September 2026

Basha Shek

వరుసగా సినిమాలు చేస్తున్నా గత కొద్దికాలంగా శ్రీలీలకు సాలిడ్ హిట్ పడడం లేదు. అయినా ఈ ముద్దుగుమ్మకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ సినిమాలు చేస్తోంది శ్రీలీల. తమిళంలో  ధనుష్ సరసన ఆమె నటించిన ‘ఓమ్: చాప్టర్ వన్’ త్వరలోనే రిలీజ్ కానుంది.

ఇక హిందీలో స్టార్ డైరెక్టర్ అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మ్యూజికల్ డ్రామాతో  బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది శ్రీలీల. ఈ మూవీ కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా సోషల్ మీడియాలో ఒక సరికొత్త రికార్డు సృష్టించింది శ్రీలీల.  ఆ మధ్యన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేసిన ఒక వీడియో ఏకంగా 11.1 మిలియన్ల (కోటి పది లక్షలకు పైగా) లైకులు సొంతం చేసుకుంది.

తద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో (ఇండియా) అత్యధిక లైకులు సాధించిన సెలబ్రిటీల జాబితాలో చేరిపోయిందీ అందాల తార. ఇదే క్రమంలో సల్మాన్, దళపతి విజయ్   సోషల్ మీడియా రికార్డులను సైతం బద్దలు కొట్టింది శ్రీలీల.

శ్రీలీల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ‘‘లక లక లక లక’’ వీడియో క్లిప్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వైరల్ రీల్ ఇప్పటివరకు 258.1 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది.

కేవలం వ్యూస్ మాత్రమే కాకుండా, లైకుల పరంగానూ ఈ వైరల్ వీడియో సరికొత్త రికార్డులను సృష్టించింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ స్టార్ హీరోల పేరిట ఉన్న సోషల్ మీడియా రికార్డులను శ్రీలీల ఈ వీడియోతో బ్రేక్ చేసింది

మొత్తానికి చేస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నా సోషల్ మీడియాలో శ్రీలీల క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదనడానికి ఇది నిదర్శనమని చెప్పుకోవచ్చు.

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ  వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

 జయపజయాలతో సంబంధం లేకుండా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.