మొటిమలకు చెక్‌ పెట్టే మ్యాజిక్ చిట్కా.. మీ కిచెన్‌లోనే

 28 Sep 2026

Anand T

ముఖంపై నల్లటి మచ్చలు, ట్యాన్ ప్రతి ఒక్కరికి కిరాకు తెప్పింస్తుంది. కానీ ఇంట్లో ఉండే టొమాటోతో ఈజీగా ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు.  

స్కిన్ కేర్

అవును రెండు టేబుల్ స్పూన్ల టొమాటో గుజ్జులో, ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా కలపాలి.

టమాటో, పెరుగు

ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసుకుని 15-20 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయాలి.

స్కిన్ కేర్

మరో చిట్కా టొమాటో గుజ్జులో ఒక టీస్పూన్ తేనె కలపి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని 10-15 నిమిషాల పాటు ఆరనిచ్చి.. ఆ తర్వాత నీటితో కడిగేయాలి.

టొమాటో, తేనె

రెండు స్పూన్‌ల టామోటా గుజ్జులో కొన్ని చుక్కల నిమ్మరసం వేసి దాన్ని ముఖానికి అప్లై చేసి 10-15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి.

టొమాటో, నిమ్మరసం

కొద్దిగా టొమాటో రసం తీసుకుని, అందులో పావు టీస్పూన్ కస్తూరి పసుపు, కొంచెం గంధం పొడి వేసి మెత్తటి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి.

టొమాటో, పసుపు,

ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేసుకొని ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమల కారణంగా ఏర్పడిన నల్లటి మచ్చలు తొలగిపోతాయి.

మొటిమలకు చెక్

అయితే ఈ ఫేస్ ప్యాక్స్‌లో దేనిని ఉపయోగించే ముందైనా.. ముందుగా చేతిపై లేదా మెడపై కొద్దిగా రాసుకుని అలెర్జీలు రావడం లేదని నిర్ధారించుకోవడం ముఖ్యం.

ప్యాచ్ టెస్ట్