Vaishnavi Chaitanya: బోనమెత్తిన టాలీవుడ్ హీరోయిన్.. ఉజ్జయని మహంకాళి అమ్మవారి సన్నిదిలో వైష్ణవి చైతన్య..
రాష్ట్రంలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు హైదరాబాద్ మహా నగరంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలను ప్రభుత్వ అధికారులు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలు ఆగస్ట్ 2న ఆదివారం ఘనంగా జరిగాయి.

తెలంగాణ సంసృతి సంప్రదాయలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు హైదరాబాద్ లో ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. భక్తి శ్రద్ధలతో అమ్మవార్లకు బోనాలు సమర్పించి మొక్కలు చెల్లించుకుంటున్నారు భక్తులు. దీంతో బోనాల వేడుకలకు భారీగా జనాలు తరలి వస్తుండడంతో ప్రభుత్వం దగ్గరుండి భద్రతా ఏర్పాట్లు చూసుకుంటుంది. ఈ సందర్భంగా ఆగస్ట్ 2న సికింద్రాబాద్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అత్యంత భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఎక్కువమంది చదివినవి : K. Raghavendra Rao: ఆ హీరోయిన్‌తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..
సంప్రదాయబద్ధంగా పట్టుచీరలో మరింత అందంగా ముస్తాబై నెత్తిన బోనం ఎత్తుకుని ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టింది. ఎంత జాగ్రత్తగా.. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం సమర్పించింది వైష్ణవి చైతన్య. అయితే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో అడుగుపెట్టిన వైష్ణవిని చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ఆలయానికి వచ్చిన వైష్ణవికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగాతం పలికి.. ఆమెకు వేదాశీర్వచనంతోపాటు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..
అనంతరం మీడియోతో మాట్లాడిన వైష్ణవి చైతన్య.. అమ్మవారి దివ్య సన్నిధిలో బోనం సమర్పించడం తనకు ఎంతో ఆధ్యాత్మిక ప్రశాంతతన, ఆనందాన్ని ఇచ్చిందని వెల్లడించింది. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. యూట్యూబర్ గా సినీ ప్రయాణం స్టార్ట్ చేసి బేబీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది వైష్ణవి చైతన్య. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలతో బిజీగా ఉంది.
ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..
బోనమెత్తిన వైష్ణవి చైతన్య..
బోనమెత్తిన హీరోయిన్..సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన #vaishnavichaitanya#Epic #Arya40 #bonalu #mahankali pic.twitter.com/nXqeP4ODfh
— SZN (@Suzenbabu) August 2, 2026
ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్లో తనే స్పెషల్..
