ఆ హీరోయిన్ అంటే నాకు చాలా ఇష్టం.. ఆమె లేదంటే తట్టుకోలేకపోతున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న చైల్డ్ ఆర్టిస్ట్
మన శంకరవరప్రసాద్ గారు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించింది. అలాగే చిరంజీవి పిల్లలుగా ఇద్దరు చిన్నారులు కనిపిస్తారు. అందులో కుమారుడు విక్కీ పాత్ర అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చాలా మంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా మంది ఇప్పుడు హీరోలు, హీరోయిన్స్ గా సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. ఇక ఇటీవల ఓ చిన్నారి చాలా పాపులర్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా గట్టిగానే ఆకట్టుకుంది. సంక్రాంతి కానుకగా విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించింది. అలాగే చిరంజీవి పిల్లలుగా ఇద్దరు చిన్నారులు కనిపిస్తారు. అందులో కుమారుడు విక్కీ పాత్ర అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆ విక్కీ పాత్ర చేసింది అబ్బాయి కాదు అమ్మాయి. సినిమా సక్సెస్ మీట్ లో అది రివీల్ అయ్యింది. తన పేరు ఊహ.
అసలు ఆ సినిమా చేయాలనుకోలేదు.. అనుకోకుండా చేశాం..! పెద్ద హిట్ అయ్యింది
హైదరాబాద్ లోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన ఈ చిన్నారి ప్రస్తుతం రెండో తరగతి చదువుతోంది. సినిమాలంటే చాలా ఇష్టం. ఆ మక్కువతోనే ఇప్పటికే 20కిపైగా చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ‘మన శంకరవరప్రసాద్ గారు’లో చిరంజీవికి కుమారుడిగా నటించి మెప్పింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఈ చిన్నారి మాట్లాడుతూ.. తనకు దివంగత నటి సౌందర్య అంటే చాలా ఇష్టమని ఆమె గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. ఈ ఇంటర్వ్యూలో సౌందర్య గురించి ప్రశ్న రాగానే ఊహ కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. సౌందర్య చనిపోయారని గుర్తు చేసుకుని ఊహ ఏడ్చేసింది.
మహేష్ బాబుకు అమ్మగా నటించాలని ఉంది.. ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందో.!
సౌందర్య పట్ల తనకున్న అభిమానాన్ని, ఆమె తన నటనకు ఎలా స్ఫూర్తినిచ్చారో ఊహ వివరించింది. “వాళ్ళ ద్వారానే నేను యాక్టింగ్ నేర్చుకున్నా” అని ఊహ పేర్కొంది. సౌందర్య చిత్రాలను చూస్తూనే తాను నటనలో మెళకువలు నేర్చుకున్నానని ఊహ తెలిపింది. సౌందర్య లేకపోయినా ఆమె నటనా వారసత్వం నేటి తరం నటులకు, ముఖ్యంగా బాల నటులకు ఎలా స్ఫూర్తినిస్తుందో ఊహ మాటలు నిరూపించాయి.
చూడటానికి అలా ఉంటుంది కానీ.. ఆమెకు పొగరెక్కువ..! సాయి పల్లవి నిజస్వరూపం ఇదే అంటున్న యంగ్ హీరో
సౌందర్య ఫోటోలు..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




