నన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నారు.. సీరియల్ బ్యూటీ ఆవేదన..

Rajitha Chanti

Pic credit - Instagram

23 August 2026

బుల్లితెరపై ప్రసారమయ్యే పాపులర్ సీరియల్ 'గుండెనిండా గుడిగంటలు' ద్వారా రోహిణి పాత్రలో ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి జ్యోతిక మునిరత్నం.

ఈ సీరియల్‌లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో జీవిస్తూ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది.

తెరపై కనిపించే పాత్ర ఆధారంగా తనపై జరుగుతున్న వ్యక్తిగత ట్రోలింగ్, తన నటన ప్రయాణం గురించి జ్యోతిక స్పందిస్తూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

నటిగా రోహిణి పాత్రలో ఒదిగిపోయి నటిస్తున్నప్పటికీ, కొంతమంది నెటిజన్లు పాత్రకు, వ్యక్తిగత జీవితానికి ఉన్న తేడాను మరచిపోయి తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారని జ్యోతిక ఆవేదన వ్యక్తం చేశారు.

సీరియల్‌లో తను చేసే పాత్రను చూసి నిజ జీవితంలో కూడా అలాగే ఉంటానని కొందరు భావించడం, సోషల్ మీడియాలో వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం బాధ కలిగిస్తుందని పేర్కొన్నారు.

ఎన్ని విమర్శలు, ట్రోల్స్ వచ్చినా ఒక నటిగా తనకు ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేయడమే తన ప్రధాన లక్ష్యమని జ్యోతిక స్పష్టం చేశారు.

నెగెటివ్ రోల్ చేయడం అనుకున్నంత సులభం కాదని, ప్రేక్షకులు ఆ పాత్రను ఎంతగా ద్వేషిస్తే, ఒక ఆర్టిస్ట్‌గా తాను అంతగా విజయం సాధించినట్లేనని ఆమె అభిప్రాయపడ్డారు. 

కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, అభిమానుల మద్దతుతోనే తాను ముందడుగు వేస్తున్నట్లు తెలిపారు. ఆ ద్వేషమే నా విజయానికి నిదర్శనమని చెప్పుకొచ్చారు.