AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uppal Balu: చాలా కష్టాలు చూశా..! ఎప్పుడు బాధపడలేదు.. కానీ ఆరోజు నేను బాగా ఏడ్చేశా..

బిగ్ బాస్ సందడి మొదలైంది. త్వరలోనే సీజన్ 10 స్టార్ట్ కాబోతుండగా.. అందుకు ముందే సామాన్యులను ఎంపిక చేసే ప్రక్రియ మొదలైంది. కొన్ని రోజులుగా అగ్ని పరీక్ష 2 ద్వారా కంటెస్టెంట్స్ ను సెలక్ట్ చేస్తున్నారు. మొదటి నుంచి ప్రోమోల ద్వారా క్యూరియాసిటిని కలిగించిన మేకర్స్.. ఇప్పుడు అగ్ని పరీక్ష2లోనూ అదే స్ట్రాటజీ వాడుతున్నారు.

Uppal Balu: చాలా కష్టాలు చూశా..! ఎప్పుడు బాధపడలేదు.. కానీ ఆరోజు నేను బాగా ఏడ్చేశా..
Uppal Balu
Rajeev Rayala
|

Updated on: Aug 24, 2026 | 1:09 PM

Share

ఉప్పల్ బాలు, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన వ్యక్తి. రీసెంట్ గా బిగ్ బాస్ అగ్నిపరీక్ష సమయంలో ఆయనను అవమానించారని చెప్పి వార్తల్లో నిలిచాడు. బిగ్ బాస్ అగ్నిపరీక్షకు తనను పిలిచారని, పిలిచి అవమానించారని ఉప్పల్ బాలు పలు వీడియోల ద్వారా తెలిపాడు. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని గుండెలు పిండే వాస్తవాలను, వ్యక్తిగత పోరాటాలను, మానవ సంబంధాల ప్రాముఖ్యతను పంచుకున్నాడు. తన జెండర్ గురించి సమాజం చేసే విమర్శల పట్ల తాను ఏమాత్రం కలత చెందనని, “ఐ డోంట్ కేర్” అని బాలు స్పష్టం చేశాడు. అయితే, తన జీవితంలో అత్యంత బాధ కలిగించిన సందర్భం, తనను వ్యక్తిగతంగా అర్థం చేసుకున్న సన్నిహితులు, బావలు, బంధువులు సమాజిక ఒత్తిళ్లకు తలొగ్గి తనను దూరం పెట్టినప్పుడు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

అసలు ఆ సినిమా చేయాలనుకోలేదు.. అనుకోకుండా చేశాం..! పెద్ద హిట్ అయ్యింది

డబ్బులు లేని సమయంలో తనకు అండగా నిలిచి, కారులో తిప్పుతూ “వీడు మావాడు” అని పరిచయం చేసిన స్నేహితులు, ఇరుగుపొరుగు వారి మాటలు విని తనతో స్నేహం విరమించుకున్నప్పుడు, తాను తీవ్రంగా ఏడ్చినట్లు బాలు గుర్తుచేసుకున్నాడు. తన పక్కన ఎవరైనా పురుషులు పడుకుంటే, వారిని తాను ఏమైనా చేస్తానేమో అనే అపోహ సమాజంలో ఏర్పడిందని, ఇది తనకు చాలా బాధ కలిగిందని ఆయన వివరించాడు. తాను ఏ స్నేహితుడినైనా ప్రేమగా కౌగిలించుకోవడం, సరదాగా ముద్దు పెట్టుకోవడం కేవలం స్నేహపూర్వక బంధంలో భాగమే తప్ప, తనకు అలాంటి లైంగిక ఆసక్తులు లేవని బాలు తేల్చిచెప్పాడు. ప్రజలు తన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలని, ఇతరుల మాటలు విని తనను అంచనా వేయవద్దని ఆయన కోరాడు.

మహేష్ బాబుకు అమ్మగా నటించాలని ఉంది.. ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందో.!

బాలు జీవితంలో మరో విషాదకరమైన కోణం తన తండ్రి మరణం. తన తండ్రి చనిపోయినప్పుడు కూడా తాను అంతగా బాధపడలేదని, కన్నీళ్లు పెట్టుకున్నా అది తనను ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనకు దారితీయలేదని చెప్పాడు. కెరీర్ అవకాశాలు, షూటింగ్‌లు కోల్పోకూడదనే ఉద్దేశ్యంతో, పితృకార్యాలలో తలనీలాలు సమర్పించే సంప్రదాయాన్ని కూడా వదిలేశానని బాలు వివరించాడు. అప్పుడు కూడా తాను నిజంగా బాధపడలేదని, తన తల్లి అనారోగ్యం, స్నేహితుల దూరం మాత్రం తనను తీవ్రంగా కలచివేశాయని ఆయన తెలిపాడు. బాలు చిన్నతనంలో ఎదుర్కొన్న మరో మానసిక సంఘర్షణ తన తల్లి అనారోగ్యం. తాను ఏడవ తరగతి చదువుతున్నప్పుడు తన తల్లి మానసిక అనారోగ్యానికి గురయ్యారని, రాత్రి సమయాల్లో ఊర్లోకి పారిపోతుండేవారని బాలు గుర్తుచేసుకున్నాడు. తన తండ్రి ఆమెను బలవంతంగా ఇంటికి తీసుకువచ్చి కొట్టేవాడని, అది చూసి తాను ఏడ్చేవాడినని చెప్పారు. కర్ణాటకలోని సెడం గుల్బర్గ్‌కు తీసుకెళ్లి, అక్కడ ఒక పూజారి సలహా మేరకు మూడు నెలల పాటు తల్లికి సేవ చేశానని బాలు వివరించాడు. జడ వేయడం నుంచి బట్టలు ఉతకడం, తినబెట్టడం, పడుకోబెట్టడం వరకు అన్ని పనులూ తానే దగ్గరుండి చూసుకున్నానని తెలిపాడు. ఆ సేవ ఫలితంగా తన తల్లి కోలుకుని, ఇప్పుడు ఇంట్లో అందరికీ ఆనందాన్ని పంచుతోందని బాలు సంతోషంగా తెలిపాడు. ఇప్పుడు తనతో స్నేహం మానుకున్నవారు మళ్ళీ దగ్గరయ్యారని, కానీ కొందరు మాత్రం ఇంకా దూరంగా ఉన్నారని అన్నారు. తన జెండర్‌పై ఇతరుల వ్యాఖ్యలను పట్టించుకోనని, అది వారి వ్యక్తిగతం అని బాలు స్పష్టం చేశారు. చాలా మంది యువకులు తనను ఆదర్శంగా తీసుకుని రీల్స్ చేస్తున్నారని, తన డైలాగులను ఉపయోగిస్తున్నారని, తనను చూసి ఒకప్పుడు హేళన చేసినవారే ఇప్పుడు తనను కాపీ చేస్తున్నారని, సమాజంలో తనను నలుగురు మంచివాడిగా గుర్తించాలనేదే తన ఏకైక కోరిక అని ఉప్పల్ బాలు చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

చూడటానికి అలా ఉంటుంది కానీ.. ఆమెకు పొగరెక్కువ..! సాయి పల్లవి నిజస్వరూపం ఇదే అంటున్న యంగ్ హీరో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Follow Us
ఎప్పుడు బాధపడలేదు.. కానీ ఆరోజు నేను బాగా ఏడ్చేశా..
ఎప్పుడు బాధపడలేదు.. కానీ ఆరోజు నేను బాగా ఏడ్చేశా..
వార్నీ.. ఇంత సింపులా.. ఈ ట్రిక్స్ తెలిస్తే నిమిషాల్లోనే..
వార్నీ.. ఇంత సింపులా.. ఈ ట్రిక్స్ తెలిస్తే నిమిషాల్లోనే..
రాళ్ల నేలలో ఖర్జూర సాగు.. మహిళా రైతుల వినూత్న ప్రయోగం!
రాళ్ల నేలలో ఖర్జూర సాగు.. మహిళా రైతుల వినూత్న ప్రయోగం!
ప్రియురాలికి పుట్టిన రోజు కానుక..కట్‌చేస్తే కటకటాల్లోకి ప్రేమజంట!
ప్రియురాలికి పుట్టిన రోజు కానుక..కట్‌చేస్తే కటకటాల్లోకి ప్రేమజంట!
కప్పల గురించి ఇది తెలుసా? నోటితో కాకుండా నీటిని ఎలా తాగుతాయంటే?
కప్పల గురించి ఇది తెలుసా? నోటితో కాకుండా నీటిని ఎలా తాగుతాయంటే?
అర చేతిలో ఈ రేఖలు ఉంటే.. నిజంగా రెండు పెళ్లీలు జరుగుతాయా!
అర చేతిలో ఈ రేఖలు ఉంటే.. నిజంగా రెండు పెళ్లీలు జరుగుతాయా!
సడెన్‌గా నాగుపాము ఎదురైతే ఏం చేయాలి? ఈ తప్పులు చేస్తే ప్రాణాలకే..
సడెన్‌గా నాగుపాము ఎదురైతే ఏం చేయాలి? ఈ తప్పులు చేస్తే ప్రాణాలకే..
సంచలన నిర్ణయం.. మహిళలకు గుడ్‌న్యూస్‌..ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు
సంచలన నిర్ణయం.. మహిళలకు గుడ్‌న్యూస్‌..ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు
టిక్కెట్టుతో పాటు రైల్వే బెడ్‌షీట్లు ఫ్రీ! నెటిజన్ల రియాక్షన్
టిక్కెట్టుతో పాటు రైల్వే బెడ్‌షీట్లు ఫ్రీ! నెటిజన్ల రియాక్షన్
ఆపరేషన్ సింధూర్‌లో ధ్వంసం ఉగ్ర స్థావరాన్ని పునర్నిర్మించిన పాక్!
ఆపరేషన్ సింధూర్‌లో ధ్వంసం ఉగ్ర స్థావరాన్ని పునర్నిర్మించిన పాక్!