ఆయా షేర్..! ట్రోల్స్ తర్వాత బిగ్ బాస్ నుంచి పిలుపు వచ్చింది.. కానీ నన్ను తట్టుకోలేరు
బుల్లితెర ఆడియెన్స్ ఎదురు చూస్తోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. సెప్టెంబర్ మొదటి వారంలోనే బిగ్ బాస్ 10 గ్రాండ్ లాంఛింగ్ ఉండనుంది. ఈసారి కూడా సెలబ్రిటీలకు కామన్ పీపుల్‌కు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశం కల్పించేందుకు ‘అగ్నిపరీక్ష’ను నిర్వహిస్తున్నారు.

జానపద గాయకుడు భూతం రమేష్ ఇలా చెప్తే చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు కానీ.. నాని సినిమా ప్యారడైజ్ సినిమాలోని ఆయె షేర్ పాట ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ పాట ఆయన కెరీర్‌లో ఒక ముఖ్యమైన మలుపుగా నిలిచింది. ఆ సాంగ్ పాడటం వల్ల ఆయన మీద కొన్ని ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి. వాటిపై ఆయన కూడా స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చాడు. కాగా భూతం రమేష్ ఒక ఇంటర్వ్యూలో తన అనుభవాలను, ట్రోల్స్‌ను ఎదుర్కొన్న తీరును పంచుకున్నాడు. మ్యూజిక్ లేకుండా “ఆయా షేర్” పాటను ఆలపించినప్పుడు, ఆయనకు ట్రోల్స్ రూపంలో అనూహ్యమైన ప్రతిస్పందన ఎదురైంది. మొదట వీటిని నెగెటివ్‌గా భావించినా, తర్వాత అవి తన కెరీర్‌కు ఒక గొప్ప సానుకూల అంశంగా మారాయని భూతం రమేష్ వివరించాడు. ఆయె షేర్ వీడియోను పోస్ట్ చేసిన కేవలం గంటలోనే మిలియన్ వ్యూస్‌ను సాధించడం చూసి, తన జీవితంలో ఏదో పెద్ద మార్పు రాబోతుందని ఆయన అప్పుడే ఊహించా అన్నాడు.
అసలు ఆ సినిమా చేయాలనుకోలేదు.. అనుకోకుండా చేశాం..! పెద్ద హిట్ అయ్యింది
ట్రోల్స్ వల్ల తనను ప్రపంచం మొత్తం ఒక్కసారిగా నెలరోజుల పాటు చూసిందని భూతం రమేష్ ఆనందంగా తెలిపాడు. మార్కెట్లకు వెళ్లినా, సూపర్ మార్కెట్లకు వెళ్లినా ప్రజలు తనను గుర్తుపట్టి “ఆయా షేర్” అంటూ పలకరించడం మొదలుపెట్టారని ఆయన వివరించాడు. పాలవారు, పేపర్ బాయ్స్ కూడా “ఆయా షేర్” అని సలాం కొట్టేవారని చెప్పుకొచ్చాడు. ట్రోల్స్ తన చుట్టూ ఉన్నవారికి, స్నేహితులకు, సహోద్యోగులకు తన గురించి మరింత తెలియజేశాయని ఆయన అన్నాడు. అలాగే చిన్నప్పటి నుండి అప్ అండ్ డౌన్స్‌ను చూసిన తనకు ఇవి పెద్దవి కావని, నెగెటివిటీని పాజిటివ్‌గా మార్చుకోవచ్చని ఆయన నిరూపించా అని తెలిపాడు. ట్రోల్స్ వల్ల తనకు నెగెటివిటీ వస్తుందని భయపడకుండా, ఆ నెగెటివిటీని తిప్పికొట్టానని చెప్పుకోవచ్చు అని భూతం రమేష్ తెలిపారు. నిజానికి, ట్రోలర్స్‌కు ధన్యవాదాలు చెప్పుకోవాలని, వారి వల్లనే తనకు ఇంత గుర్తింపు వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డాడు.
మహేష్ బాబుకు అమ్మగా నటించాలని ఉంది.. ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందో.!
“ఆయా షేర్” తర్వాత ఒక మంచి సినిమాలో క్యారెక్టర్ రోల్ చేసే అవకాశం వచ్చిందని చెప్పాడు. అలాగే బిగ్ బాస్ గురించి స్పందిస్తూ.. నాపై ట్రోల్స్ వచ్చిన తర్వాత నాకు బిగ్ బాస్ నుంచి కూడా కాల్ వచ్చింది. కానీ మనకు అవసరమా అని అనిపించింది. అలాగే నేను వెళ్తే బిగ్ బాస్ తట్టుకోదు.. నన్ను తట్టుకోలేరు. నాది ఆట ఉంటుంది, పాట ఉంటుంది. బిగ్ బాస్ లో ఎక్కువగా సెలబ్రెటీలనే తీసుకుంటున్నారు. అదికూడా మంచి ఫ్రెమ్ ఉన్నవారినే తీసుకుంటున్నారు. అలా కాకుండా చిన్న చిన్న పాత్రలు, గుర్తింపు లేని పాత్రలు చేసే వారిని తీసుకుంటే బాగుంటుందని ఆయన తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
చూడటానికి అలా ఉంటుంది కానీ.. ఆమెకు పొగరెక్కువ..! సాయి పల్లవి నిజస్వరూపం ఇదే అంటున్న యంగ్ హీరో
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




