AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: బౌలింగ్ వేస్తున్నావా.. బుల్లెట్ పేలుస్తున్నావా? 153.6 KMPH స్పీడ్‌తో రెచ్చిపోయిన భారత బౌలర్

Video: టీమిండియా యువ పేసర్ కార్తీక్ త్యాగి నిప్పులు చెరిగే వేగంతో వార్తల్లో నిలిచారు. మీరట్ మావరిక్స్ తరఫున ఆడుతున్న ఆయన గంటకు 153.6 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి టీమిండియా క్రికెటర్ ప్రిన్స్ యాదవ్‌ను అవుట్ చేశారు. ఈ విధ్వంసకర బౌలింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Video: బౌలింగ్ వేస్తున్నావా.. బుల్లెట్ పేలుస్తున్నావా? 153.6 KMPH స్పీడ్‌తో రెచ్చిపోయిన భారత బౌలర్
Kartik Tyagi
Rakesh
|

Updated on: Aug 24, 2026 | 1:18 PM

Share

Video: యూపీ టీ20 లీగ్‌లో టీమిండియా యువ పేసర్ కార్తీక్ త్యాగి నిప్పులు చెరిగే వేగంతో వార్తల్లో నిలిచారు. మీరట్ మావరిక్స్ తరఫున ఆడుతున్న ఆయన గంటకు 153.6 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి టీమిండియా క్రికెటర్ ప్రిన్స్ యాదవ్‌ను అవుట్ చేశారు. ఈ విధ్వంసకర బౌలింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఒకవైపు భారత సీనియర్ జట్టు శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడుతుండగా, మరోవైపు వైట్ బాల్ ఫార్మాట్ ప్లేయర్లు దేశవాళీ టీ20 లీగ్‌లలో సత్తా చాటుతున్నారు. అందులో భాగంగా ఆగస్టు 23న మీరట్ మావరిక్స్, గోరఖ్‌పూర్ లయన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కార్తీక్ త్యాగి తన వేగంతో మైదానంలో సెన్సేషన్ సృష్టించారు. గోరఖ్‌పూర్ లయన్స్ బ్యాటర్, టీమిండియా యంగ్ పేసర్ ప్రిన్స్ యాదవ్ క్రీజులో ఉండగా గంటకు 153.6 కిలోమీటర్ల వేగంతో ఒక రాకెట్ లాంటి డెలివరీ వేశారు.

రింకూ సింగ్ చేతికి చిక్కిన వికెట్

153.6 కిమీ వేగంతో వచ్చిన ఆ బంతిని తట్టుకోవడం ప్రిన్స్ యాదవ్‌కు సాధ్యపడలేదు. షాట్ ఆడటానికి ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నారు. ఈ క్రమంలో మీరట్ మేవరిక్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ అద్భుతమైన క్యాచ్‌గా మలుచుకోవడంతో ప్రిన్స్ యాదవ్ ఇన్నింగ్స్ ముగిసింది. వేగవంతమైన బౌలర్‌గా గుర్తింపు ఉన్న ప్రిన్స్ యాదవ్ సైతం త్యాగి విసిరిన ఈ బుల్లెట్ డెలివరీకి ఒక్కసారిగా షాక్‌ గురయ్యారు.

149 కిమీ యార్కర్‌తో ఎగిరిపడ్డ మిడిల్ స్టంప్

కార్తీక్ త్యాగికి ఈ లీగ్‌లో ఇలాంటి విధ్వంసకర బౌలింగ్ కొత్తేమీ కాదు. ఆగస్టు 21న నోయిడా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గంటకు 149 కిలోమీటర్ల వేగంతో పిన్ పాయింట్ యార్కర్ విసిరి బ్యాటర్ శౌర్య సింగ్ మిడిల్ స్టంప్‌ను లేపి పడేసారు. తన వద్ద ఉన్న అపారమైన పేస్ పవర్‌ను క్రమశిక్షణతో ఉపయోగించుకుంటూ లీగ్‌లో వరుసగా వికెట్లు పడగొడుతున్నారు.

గత రెండేళ్లలో మారిన బౌలింగ్ శైలి

గడిచిన రెండేళ్ల కాలంలో కార్తీక్ త్యాగి తన బౌలింగ్ వేగాన్ని గణనీయంగా పెంచుకున్నారు. 2024 యూపీ టీ20 లీగ్ నుంచి ఇప్పటివరకు ఆయన 140 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ఏకంగా 150కి పైగా బంతులు విసిరారు. ఇలాంటి క్రమం తప్పని వేగం రాబోయే రోజుల్లో ఆయనను మళ్లీ భారత జాతీయ జట్టులోకి తీసుకెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కార్తీక్ త్యాగి చూపిస్తున్న ఈ రాకెట్ స్పీడ్ భారత ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి కొత్త ఆశలు రేపుతోంది. ఇలాగే నిలకడగా రాణిస్తే త్వరలోనే ఆయన టీమిండియా వైట్ బాల్ స్క్వాడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us