అందంతో కట్టిపడేస్తున్న రంగస్థలం బ్యూటీ పూజిత 

Rajeev 

17 April 2026

అక్కినేని నాగార్జున, కార్తీ నటించిన ఊపిరి సినిమాతో పరిచయం అయ్యింది అందాల భామ పూజిత పొన్నాడ.

ఆ తర్వాత అక్కినేని నాగచైతన్య ప్రేమమ్ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా కనిపించింది. ఈ రెండు సినిమాల్లో తన క్యూట్ నెస్ తో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఆతర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది పూజిత.

రంగస్థలం సినిమాలో హీరో ఆది పినిశెట్టి ప్రేమించిన అమ్మాయిగా కనిపించింది. సినిమాలో ఆమె కనిపించేది కొంతసేపే అయినా మంచి మార్కులు కొట్టేసింది. 

ఆ తర్వాత రాజ్ తరుణ్ రాజుగాడు, బ్రాండ్ బాబు, హ్యాపీ వెడ్డింగ్, రాజశేఖర్ కల్కి, వేర్ ఈజ్ వెంకట లక్ష్మి, రన్, మిస్ ఇండియా, కథ కంచికి మనం ఇంటికి, ఓదెల రైల్వే స్టేషన్ సినిమాల్లో మెప్పించింది.

రవితేజ రావణాసుర సినిమాలోనూ నటించింది. కానీ ఈ సినిమాలేవీ ఈ ముద్దుగుమ్మకు హిట్స్ కానీ అనుకున్నంత క్రేజ్ గాని తెచ్చిపెట్టలేదు. 

ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురుచూస్తుంది ఈ అమ్మడు. అలాగే సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది.