AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dangerous Foods: జర భద్రం! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 7 ఆహార పదార్థాలు ఇవే.. తింటే అనారోగ్యం ఖాయం!

Dangerous Foods: ఈ ఏడు రకాల ఆహార పదార్థాల్లో ఉన్న ఒకే ఒక్క కామన్ పాయింట్ 'క్రేవింగ్స్'. ఇవి తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. కానీ ఇవి మన ఆరోగ్యాన్ని లోలోపల దెబ్బతీస్తాయి. అందుకే వీటిని వీలైనంత వరకు దూరం పెట్టడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం..

Dangerous Foods: జర భద్రం! ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన 7 ఆహార పదార్థాలు ఇవే.. తింటే అనారోగ్యం ఖాయం!
Dangerous Foods
Subhash Goud
|

Updated on: Apr 17, 2026 | 2:59 PM

Share

Dangerous Foods: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనకు తెలియకుండానే మనం అనేక అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు బానిసవుతున్నాం. రుచిగా ఉన్నాయని మనం తినే కొన్ని పదార్థాలు మన ప్రాణాలకే ముప్పు తెచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత అన్-సేఫ్ (అన్-హెల్తీ)గా పరిగణించే టాప్ 7 ఆహార పదార్థాలు, వాటి వల్ల కలిగే నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. చక్కెరతో నిండిన పానీయాలు:

నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. జాబితాలో మొదటి స్థానంలో కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్స్ ఉన్నాయి. వీటిలో షుగర్ కంటెంట్ విపరీతంగా ఉంటుంది. ఇవి తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలతో పాటు సంతానలేమి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది.

ఇది కూడా చదవండి: Medicine Price Hike: షాకింగ్‌ న్యూస్‌.. పెరగనున్న మందుల ధరలు.. ఏయే టాబ్లెట్స్‌ అంటే..!

ఇవి కూడా చదవండి

2. ప్రాసెస్ చేసిన మాంసం:

సాసేజ్‌లు, హాట్ డాగ్స్ వంటి ప్రాసెస్ చేసిన మాంసం తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇవి సంతానోత్పత్తి సామర్థ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయి.

3. ప్యాకేజ్డ్ స్నాక్స్, స్వీట్లు :

ఆలూ చిప్స్, కార్న్ చిప్స్, కుకీస్, కేక్స్ వంటి ప్యాకేజ్డ్ పదార్థాల వల్ల ఫ్యాటీ లివర్ సమస్య తలెత్తుతుంది. అంతేకాకుండా టైప్-2 డయాబెటిస్, హార్ట్ ఎటాక్, కొన్ని రకాల క్యాన్సర్లకు ఇవి కారణమవుతాయి.

4. ఫ్రోజెన్, రెడీ-టు-ఈట్ ఫుడ్స్:

ఫ్రోజెన్ పిజ్జాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ నగెట్స్ వంటివి డయేరియా, హెపటైటిస్-ఏ, నోరో వైరస్ వంటి ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు.

5. ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్:

బర్గర్లు, ఫ్రైడ్ చికెన్ వంటి నూనెలో వేయించిన పదార్థాలు లివర్‌ను డ్యామేజ్ చేస్తాయి. వీటి వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.

6. ప్రాసెస్ చేసిన చీజ్, సాస్‌లు:

సినిమా థియేటర్లలో దొరికే చీజ్ పాప్‌కార్న్ (పౌడర్డ్ చీజ్), బ్రెడ్ మీద రాసే చీజ్ స్ప్రెడ్‌లు, టమాటో కెచప్‌ల వల్ల హై బీపీ, జీర్ణక్రియ సమస్యలు, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.

7. ఇన్స్టంట్ బ్రేక్ ఫాస్ట్ ప్రొడక్ట్స్:

ఇన్స్టంట్ నూడిల్స్, కార్న్‌ఫ్లేక్స్, ముయెస్లీ వంటి ప్యాక్డ్ సీరియల్స్, ఇన్స్టంట్ ఉప్మా, పోహాలలో ప్రిజర్వేటివ్స్, చక్కెర ఎక్కువగా ఉంటాయి. ఇవి పళ్ళ క్షయానికి ప్రధాన కారణమవుతాయి. ఈ ఏడు రకాల ఆహార పదార్థాల్లో ఉన్న ఒకే ఒక్క కామన్ పాయింట్ ‘క్రేవింగ్స్’. ఇవి తిన్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. కానీ ఇవి మన ఆరోగ్యాన్ని లోలోపల దెబ్బతీస్తాయి. అందుకే వీటిని వీలైనంత వరకు దూరం పెట్టడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం.

Dangerous Foods (AI Image)

Dangerous Foods (AI Image)

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us