AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Ideas: సమ్మర్ బిజినెస్.. వేసవిలో బంపర్ ఆదాయం.. ఈ 5 వ్యాపారాలతో కాసుల వర్షం!

Best Business Ideas: వేసవిలోని ఈ 3-4 నెలలు మీ వార్షిక ఆదాయంలో ఒక పెద్ద భాగాన్ని అందించగలవు. సరైన ప్లానింగ్, కష్టపడే తత్వం ఉంటే ఈ చిన్న వ్యాపారాలే మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ బడ్జెట్‌కు తగ్గ..

Business Ideas: సమ్మర్ బిజినెస్.. వేసవిలో బంపర్ ఆదాయం.. ఈ 5 వ్యాపారాలతో కాసుల వర్షం!
Summer Business Ideas
Subhash Goud
|

Updated on: Apr 16, 2026 | 8:01 PM

Share

Best Business Ideas: ఏప్రిల్ నెల పూర్తి కాకముందే ఎండలు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ ప్రజల అవసరాలు కూడా మారుతుంటాయి. ఈ మార్పునే పెట్టుబడిగా మార్చుకుంటే వేసవిలో అద్భుతమైన లాభాలను గడించవచ్చు. కేవలం రూ.10,000 నుండి రూ.50,000 పెట్టుబడితో ప్రారంభించగల 5 సూపర్ హిట్ బిజినెస్ ఐడియాలు మీ కోసం.

ఇది కూడా చదవండి: Gold: 2021లో కొన్న బంగారానికి ఇప్పుడు లాభం ఎంతో తెలిస్తే మతిపోతుంది!

1. కూలర్లు, ఏసీలను అద్దెకు ఇవ్వడం:

వేసవిలో అందరూ కొత్త ఏసీలు లేదా కూలర్లు కొనలేరు. ముఖ్యంగా అద్దె ఇళ్లలో ఉండేవారు లేదా తాత్కాలికంగా నగరానికి వచ్చేవారు వీటిని అద్దెకు తీసుకోవడానికి మొగ్గు చూపుతారు.

ఇవి కూడా చదవండి

ఐడియా: సెకండ్ హ్యాండ్ కూలర్లను కొనుగోలు చేసి, వాటిని మంచి కండిషన్‌లో ఉంచి సీజన్ వారీగా అద్దెకు ఇవ్వవచ్చు. దీనికి ఆదాయం ఒక కూలర్‌పై నెలకు రూ.500 నుండి రూ.1000 వరకు అద్దె వస్తుంది. సీజన్ ముగిసేసరికి మీ పెట్టుబడి తిరిగి రావడమే కాకుండా మంచి లాభం కూడా మిగులుతుంది.

2. ఐస్ క్యూబ్స్ సప్లై (Ice Cube Supply)

వేసవిలో శుభకార్యాలు, పార్టీలు, రెస్టారెంట్లు, జ్యూస్ సెంటర్లలో ఐస్ క్యూబ్స్ డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది.

ఐడియా: ఒక చిన్న ఐస్ మేకింగ్ మెషిన్ లేదా డీప్ ఫ్రీజర్ సహాయంతో శుభ్రమైన నీటితో ఐస్ క్యూబ్స్ తయారు చేసి సమీపంలోని హోటళ్లకు, ఈవెంట్లకు సరఫరా చేయవచ్చు. దీనికి కూడా మంచి ఆదాయం పొందవచ్చు.

3. సన్ స్క్రీన్, సన్ గ్లాసెస్ విక్రయం

ఎండల నుండి రక్షణ పొందేందుకు ప్రజలు ఇప్పుడు చాలా అవగాహనతో ఉన్నారు. అందుకే వేసవిలో సన్ స్క్రీన్ లోషన్లు, మాయిశ్చరైజర్లు, స్టైలిష్ సన్ గ్లాసెస్‌కు గిరాకీ బాగుంటుంది.

ఐడియా: రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతాల్లో లేదా కాలేజీల దగ్గర చిన్న స్టాల్ ఏర్పాటు చేసి బ్రాండెడ్, బడ్జెట్ ఫ్రెండ్లీ వస్తువులను విక్రయించవచ్చు.

4. కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ డిస్ట్రిబ్యూషన్

దాహం వేసినప్పుడు ప్రతి అడుగులోనూ నీటి బాటిల్ లేదా కూల్ డ్రింక్ అవసరం ఉంటుంది. ఇది ఎప్పటికీ తగ్గని వ్యాపారం.

ఐడియా: పెద్ద కంపెనీల డిస్ట్రిబ్యూషన్ తీసుకోవచ్చు లేదా స్థానికంగా ఆఫీసులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద చల్లని నీటి క్యాన్లను సరఫరా చేయవచ్చు. ఇందులో అమ్మకాలు ఎక్కువగా ఉండటం వల్ల లాభాలు కూడా ఆశాజనకంగా ఉంటాయి.

5. ఫ్రూట్ షేక్స్, ఐస్ క్రీమ్ పార్లర్

వేసవి అంటేనే మామిడి పండ్ల రసం, పుచ్చకాయ జ్యూస్, మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్.

ఐడియా: చిన్న స్టాల్ ఏర్పాటు చేసి నాణ్యమైన, రుచికరమైన జ్యూస్‌లు అందిస్తే కస్టమర్లు క్యూ కడతారు. తక్కువ ఖర్చుతో ప్రారంభించి రోజువారీ ఆదాయం పొందేందుకు ఇది సరైన మార్గం.

వేసవిలోని ఈ 3-4 నెలలు మీ వార్షిక ఆదాయంలో ఒక పెద్ద భాగాన్ని అందించగలవు. సరైన ప్లానింగ్, కష్టపడే తత్వం ఉంటే ఈ చిన్న వ్యాపారాలే మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? మీ బడ్జెట్‌కు తగ్గ వ్యాపారాన్ని ఇప్పుడే ప్లాన్ చేసుకోండి.

ఇది కూడా చదవండి: Indian Railways: రైలు బోగీలపై పసుపు, నీలం రంగు చారలు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి వెనుక ఉన్న సీక్రెట్‌ ఇదే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us