AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monthly Pension: మీకు నెలకు రూ.61,000 పెన్షన్ కావాలా? పీపీఎఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌తో సాధ్యమే.. ఎలాగో చూడండి!

Monthly Pension: మీకు నెలారీగా 61 వేల రూపాయల పెన్షన్‌ కావాలంంటే మీకో అద్భుతమైన స్కీమ్‌ అందుబాటులో ఉంది. అదే పీపీఎఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీమ్‌. దీని వల్ల కోటి రూపాయలకుపైగా బెనిఫిట్ పొందవచ్చు. పైగా మీరు నెలకు రూ.61,000 వరకు పెన్షన్‌ కూడా పొందవచ్చు. ఈ స్కీ్‌మ్‌ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Monthly Pension: మీకు నెలకు రూ.61,000 పెన్షన్ కావాలా? పీపీఎఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌తో సాధ్యమే.. ఎలాగో చూడండి!
Pension Scheme
Subhash Goud
|

Updated on: Apr 16, 2026 | 4:28 PM

Share

Monthly Pension: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన రిటైర్మెంట్ పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఒకటి. ప్రభుత్వ మద్దతు, స్థిరమైన రాబడి, పన్ను రహిత ప్రయోజనాల వల్ల ఇది సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడి మార్గంగా పేరుపొందింది.

పీపీఎఫ్ ప్రత్యేకతలు:

వడ్డీ రేటు: ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పీపీఎఫ్‌పై 7.1% వార్షిక వడ్డీని అందిస్తోంది. ఇక పెట్టుబడి పరిమితి విషయానికొస్తే.. ఒక ఆర్థిక సంవత్సరంలో కనిష్టంగా రూ.500 నుండి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక లాక్-ఇన్ పీరియడ్: ఈ పథకం కాలపరిమితి 15 ఏళ్లు. అయితే, అవసరమైతే దీనిని 5 ఏళ్ల చొప్పున ఎన్నిసార్లైనా పొడిగించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Silver Price: వినియోగదారులకు షాకింగ్‌ న్యూస్‌.. రూ.25 వేలు పెరిగిన వెండి ధర..!

రూ.1 కోటి నిధిని ఎలా సమకూర్చుకోవాలి?

మీరు క్రమశిక్షణతో పెట్టుబడి పెడితే, పీపీఎఫ్ ద్వారా కోటి రూపాయల నిధిని సులభంగా సాధించవచ్చు. దాని లెక్కలు ఇలా ఉన్నాయి.

  • ఏడాదికి పెట్టుబడి: రూ.1,50,000 (నెలకు రూ.12,500)
  • మొత్తం కాలపరిమితి: 25 ఏళ్లు (15 ఏళ్ల ప్రాథమిక గడువు + 5 ఏళ్ల చొప్పున రెండు పొడిగింపులు)
  • వడ్డీ రేటు: 7.10%
  • మీరు పెట్టుబడి పెట్టే మొత్తం: రూ.37,50,000
  • మీకు వచ్చే వడ్డీ: రూ.65,58,015
  • మెచ్యూరిటీ విలువ: రూ.1,03,08,015 (అక్షరాలా కోటి రూపాయల పైమాటే)

నెలకు రూ.61,000 పెన్షన్ పొందడం ఎలా?

మీరు 25 ఏళ్ల తర్వాత ఈ కోటి రూపాయల నిధిని విత్ డ్రా చేయకుండా అలాగే పీపీఎఫ్ ఖాతాలో ఉంచినట్లయితే, దానిపై వచ్చే వడ్డీనే మీకు పెన్షన్‌లా ఉపయోగపడుతుంది. మీ వద్ద ఉన్న రూ.1,03,08,015 నిధిపై 7.1% వడ్డీ లెక్కిస్తే, ఏడాదికి రూ.7,31,869 వడ్డీ వస్తుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ముగింపులో ఈ వడ్డీ మొత్తాన్ని మీరు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ వార్షిక వడ్డీని 12 నెలలకు విభజిస్తే: రూ.7,31,869 / 12 = రూ.60,989 (సుమారు రూ.61,000).

ఇది కూడా చదవండి: Indian Railways: 3 గంటల ప్రయాణం కేవలం 55 నిమిషాల్లోనే..ఈ ట్రైన్‌ ప్రత్యేకతలు ఇవే!

ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ విధానంలో గొప్ప విషయం ఏమిటంటే, మీరు ప్రతి ఏటా రూ.7.31 లక్షల వడ్డీని వాడుకుంటున్నా, మీ అసలు నిధి రూ.1.03 కోట్లు మాత్రం అలాగే ఉంటుంది. ఇది మీ భవిష్యత్తు అవసరాలకు లేదా వారసులకు ఒక ఆస్తిలా మిగిలిపోతుంది. సురక్షితమైన, రిస్క్ లేని రిటైర్మెంట్ కోరుకునే వారికి పీపీఎఫ్ ఒక అద్భుతమైన వరం.

ఇది కూడా చదవండి: Bank Locker Rules: బ్యాంకు లాకర్‌లో ఎన్ని గ్రాముల బంగారం ఉంచవచ్చు? ఆర్‌బిఐ నిబంధనలు ఏంటి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us