AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: 3 గంటల ప్రయాణం కేవలం 55 నిమిషాల్లోనే.. ఈ ట్రైన్‌ ప్రత్యేకతలు ఇవే!

Indian Railways: ఈ రైలులు ప్రయాణించేందుకు ప్రయాణికులు స్టేషన్లలోని వెండింగ్ మెషీన్ల ద్వారా (UPI ఉపయోగించి), స్మార్ట్ కార్డ్ ద్వారా లేదా 'RRTS Connect' మొబైల్ యాప్ ద్వారా QR కోడ్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఢిల్లీ-ఎన్‌సిఆర్ (NCR) ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా, కాలుష్యం కూడా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

Indian Railways: 3 గంటల ప్రయాణం కేవలం 55 నిమిషాల్లోనే.. ఈ ట్రైన్‌ ప్రత్యేకతలు ఇవే!
Namo Bharat Trains
Subhash Goud
|

Updated on: Apr 16, 2026 | 2:34 PM

Share

Namo Bharat Trains: కేంద్ర ప్రభుత్వ ప్రయాణికుల కోసం సరికొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. అయితే హైస్పీడ్‌ రైళ్లను సైతం ప్రవేశపెడుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ రైలు ఢిల్లీ -మీరట్ మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ముఖ్యాంశాలు.

మార్గం, స్టేషన్లు: ఈ మార్గం మొత్తం 82 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్‌లో ప్రధానంగా ఉండే స్టేషన్లు ఉన్నాయి. అవి

ఢిల్లీలో: సరాయ్ కాలే ఖాన్, న్యూ అశోక్ నగర్, ఆనంద్ విహార్.

ఇవి కూడా చదవండి

ఉత్తర ప్రదేశ్‌లో: సాహిబాబాద్, ఘజియాబాద్, గుల్ధర్, దుహై, మురాద్ నగర్, మోదీ నగర్ (సౌత్అండ్‌ నార్త్), మీరట్ సౌత్, మీరట్ లోని ఇతర స్టేషన్లు.

ఇక ఈ రైలు వేగం విషయానికొస్తే..గరిష్ట వేగం ఈ రైళ్లు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా తయారు చేశారు. అయితే ప్రస్తుతం గంటకు 160 కి.మీ వేగంతో నడుస్తాయి. ఢిల్లీ నుంచి మీరట్ మధ్య దూరాన్ని కేవలం 55 నుండి 60 నిమిషాల్లో చేరుకోవచ్చు. గతంలో ఈ ప్రయాణానికి దాదాపు 3 గంటల సమయం పట్టేది.

రైలు ప్రత్యేకతలు:

నమో భారత్ రైలులో స్టాండర్డ్, ప్రీమియం అనే రెండు రకాల కోచ్‌లు ఉంటాయి. ఒక కోచ్ పూర్తిగా మహిళల కోసం కేటాయించారు. ప్రతి సీటు వద్ద మొబైల్/ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పాయింట్లు, ఉచిత వై-ఫై (Wi-Fi) సౌకర్యం ఉంటుంది. లగేజీ ఉంచడానికి ప్రత్యేక ర్యాక్లు, సిసిటివి కెమెరాలు, అత్యవసర పరిస్థితుల్లో డ్రైవర్‌తో మాట్లాడేందుకు ఇంటర్‌కామ్ సౌకర్యం ఉన్నాయి.

టికెట్ ధరలు:

టికెట్ ధరలు ప్రయాణించే దూరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. స్టాండర్డ్ కోచ్ కనీస ధర రూ. 20 నుండి గరిష్టంగా రూ. 150 – 160 వరకు ఉండవచ్చు. అదే ప్రీమియం కోచ్: దీని ధర స్టాండర్డ్ కోచ్ కంటే దాదాపు రెట్టింపు ఉంటుంది (సుమారు రూ. 250 – 300 వరకు).

బుకింగ్, సమయాలు

సమయాలు: ప్రతిరోజూ ఉదయం 6:00 గంటల నుండి రాత్రి 11:00 గంటల వరకు ప్రతి 15 నిమిషాలకు ఒక రైలు అందుబాటులో ఉంటుంది.

టికెట్ బుకింగ్: స్టేషన్లలోని వెండింగ్ మెషీన్ల ద్వారా (UPI ఉపయోగించి), స్మార్ట్ కార్డ్ ద్వారా లేదా ‘RRTS Connect’ మొబైల్ యాప్ ద్వారా QR కోడ్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ వల్ల ఢిల్లీ-ఎన్‌సిఆర్ (NCR) ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ తగ్గడమే కాకుండా, కాలుష్యం కూడా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
OTT Movie: ఈ సినిమా చూశాక హోటల్స్‌లో స్టే చేయాలంటే భయపడతారు
OTT Movie: ఈ సినిమా చూశాక హోటల్స్‌లో స్టే చేయాలంటే భయపడతారు
యూఎస్ వైమానిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ ఇరాన్!
యూఎస్ వైమానిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ ఇరాన్!
కోట్లాది మంది నమ్మకాన్ని తలకిందులు చేసిన తాజా మెడికల్ రిపోర్ట్!
కోట్లాది మంది నమ్మకాన్ని తలకిందులు చేసిన తాజా మెడికల్ రిపోర్ట్!
లక్షల టన్నుల బరువుండే షిప్‌లు నీటిలో ఎందుకు మునగవు?
లక్షల టన్నుల బరువుండే షిప్‌లు నీటిలో ఎందుకు మునగవు?
నిమ్మ తొక్కే కదా అని పారేస్తున్నారా?ఈ బెనిఫిట్స్ తెలిస్తే..
నిమ్మ తొక్కే కదా అని పారేస్తున్నారా?ఈ బెనిఫిట్స్ తెలిస్తే..
పూరిగుడిసెలోకి చొరబడిన విషసర్పం..గాఢ నిద్రలో ఉన్న తల్లి, కూతురిపై
పూరిగుడిసెలోకి చొరబడిన విషసర్పం..గాఢ నిద్రలో ఉన్న తల్లి, కూతురిపై
రెస్టారెంట్‌లో ఫుడ్‌ బాగోలేదని గొడవ పడకండి.. ఇలా ఫిర్యాదు చేయండి!
రెస్టారెంట్‌లో ఫుడ్‌ బాగోలేదని గొడవ పడకండి.. ఇలా ఫిర్యాదు చేయండి!
కాశీబుగ్గ బైక్ యాక్సిడెంట్ కేసులో సంచలన ట్విస్ట్..!
కాశీబుగ్గ బైక్ యాక్సిడెంట్ కేసులో సంచలన ట్విస్ట్..!
పూరీ జగన్నాథ ఆలయంలో శంఖం ఎందుకు ఊదరు? ఈ సంప్రదాయం వెనుక ఉన్న..
పూరీ జగన్నాథ ఆలయంలో శంఖం ఎందుకు ఊదరు? ఈ సంప్రదాయం వెనుక ఉన్న..
'వెంకీ' సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
'వెంకీ' సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా?