Aamani: ఇప్పుడున్న హీరోలలో అతడే నా ఫేవరేట్.. చాలా ఇష్టమైన నటుడు.. ఆమని కామెంట్స్..
ప్రముఖ హీరోయిన్ ఆమని ప్రస్తుతం సినిమాలతోపాటు సీరియల్స్ ద్వారా సినీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒకప్పుడు కథానాయికగా మెప్పించిన ఆమె.. ఇప్పుడు యంగ్ హీరోహీరోయిన్లకు తల్లిగా కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమని మాట్లాడుతూ తన పర్సనల్ విషయాలు పంచుకున్నారు. తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రస్థానం, మతాల పట్ల తనకున్న దృక్పథం గురించి ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మాతృత్వం, కుటుంబాన్ని చూసుకోవడంలో తాను ఏ విధంగా బాధ్యతలు మోస్తున్నారో వివరించారు.

ప్రముఖ సినీ నటి ఆమని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, కెరీర్ ప్రయాణం, కుటుంబ విలువలు, మతాల పట్ల తనకున్న దృక్పథం గురించి పంచుకున్నారు. తన జీవితాన్ని ఒక “సింగిల్ హ్యాండ్ ఫైట్” లా అభివర్ణిస్తూ, కుటుంబ బాధ్యతలను తాను ఎంతగా మోస్తున్నారో వివరించారు. చిన్నతనం నుంచీ ఇంటిని మెరుగుపరచడం, వస్తువులు సమకూర్చుకోవడంలో తనకి అసాధారణమైన ఆసక్తి ఉండేదని, ఇది జీవితంలో కూడా కొనసాగిందని తెలిపారు. తన పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలనే తపనతో, చదువుతో పాటు స్విమ్మింగ్ వంటి ఇతర కార్యకలాపాలలో కూడా ప్రోత్సహిస్తానని చెప్పారు. తన ఏడేళ్ల కూతురు కొన్నిసార్లు విశ్రాంతి కావాలని అడిగినా, భవిష్యత్తు కోసం ఈ కృషి అవసరమని ఆమె అన్నారు. తన కెరీర్ ప్రస్థానంలో ఎటువంటి “తప్పులు” జరగలేదని ఆమని స్పష్టం చేశారు. హీరోయిన్‌గా ఎదగడానికి ఎదురైన సవాళ్లను ఎదుర్కొన్నానని, ప్రతికూల విషయాలకు దూరంగా ఉంటూ, సానుకూల దృక్పథంతో ముందుకు సాగానని పేర్కొన్నారు.
ఎక్కువమంది చదివినవి : Aamani : సినిమాలు మానేసి సీరియల్స్ చేయడానికి కారణం అదే.. ఎట్టకేలకు ఆమని ఓపెన్ కామెంట్స్..
ఇ.వి.వి. సత్యనారాయణ,గంగై అమరన్ వంటి ప్రముఖ దర్శకులతో పనిచేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. వివాహం తర్వాత కూడా తన జీవితంలో ఎలాంటి ఒత్తిళ్లు గానీ,ఆంక్షలు గానీ లేవని, తాను ఎలా ఉండాలనుకుంటే అలాగే సంతోషంగా జీవిస్తున్నానని వెల్లడించారు. “నేను ఇంట్లో ఫ్రీ బర్డ్” అని ఆమె అన్నారు. అలాగే ఇప్పుడున్న హీరోలలో తనకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని.. అతడే తన ఫేవరేట్ హీరో అని అన్నారు. ఎన్టీఆర్ తనకు ఇష్టమైన డ్యాన్సర్ అని అన్నారు.
ఎక్కువమంది చదివినవి : K. Raghavendra Rao: ఆ హీరోయిన్‌తో 24 సినిమాలు చేశా.. అలాంటి చావు ఎవరికీ రాకూడదు.. డైరెక్టర్ రాఘవేంద్ర రావు..
ఇంటర్వ్యూలో ఆమె వివాహ జీవితం గురించి ప్రస్తావించినప్పుడు, ఆమని ఒక సంప్రదాయ హిందూ మహిళగా పేరుపొంది, ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకోవడం పట్ల చాలామంది ఆశ్చర్యపోయారని ప్రశ్నించగా..దీనికి ఆమని బదులిస్తూ, “నాకు మతాల మీద నమ్మకం లేదు. ఆడ, మగ అంతే. నాకు రిలీజియన్ అనేది ఏమీ లేదు” అని ధృడంగా చెప్పారు. తాను పెరుమాళ్ బాలాజీని పూజించినా, అది తన వ్యక్తిగత ఇష్టం మాత్రమేనని, అల్లాహ్, జీసస్‌లను ప్రార్థించే వారిని తప్పుబట్టనని స్పష్టం చేశారు. తాను కూర్చున్నప్పుడు చర్చికి వెళ్ళాలనిపిస్తే వెళ్తానని, మతాల మధ్య తనకెలాంటి విభేదాలు లేవని అన్నారు. పూజలు చేయడం, ధ్యానం చేయడం, మంత్రాలు చదవడం తనకి ఇష్టమని, కానీ ఎప్పుడూ ఇతరులను బలవంతం చేయలేదని, వారి మార్గాన్ని తప్పుగా చూడనని తెలిపారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : రూ.16 కోట్లతో తీస్తే 400 కోట్ల కలెక్షన్.. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా చేసిన సినిమా..
ఎక్కువమంది చదివినవి : Ramayana Trailer : ఏముందిరా బాబూ.. కుర్రాళ్లు తెగ వెతుకున్న చిన్నది.. రామాయణ ట్రైలర్లో తనే స్పెషల్..
