పీఎం కిసాన్‌ స్కీమ్‌పై కేంద్రం భారీ ప్రకటన.. అదేంటంటే..

August 01, 2026

Subhash

కేంద్ర ప్రభుత్వం రైతులకు మరో పెద్ద ఊరట కల్పించింది. పీఎం కిసాన్‌ పథకాన్ని మరో ఐదేళ్ల పాటు కొనసాగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. 

పెద్ద ఊరట 

2026-27 నుంచి 2030-31 వరకు ఈ పథకం కొనసాగేందుకు కేంద్రం రూ.3.15 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఆమోదించింది. రైతుల ఆదాయానికి స్థిరమైన మద్దతు అందించడమే ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది.

భారీ కేటాయింపు

పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి ఏడాది రూ.6,000 ఆర్థిక సాయం అందుతుంది. ఈ మొత్తం మూడు విడతలుగా, ఒక్కో విడతలో రూ.2,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది.

ఏడాదికి ఎంత డబ్బు?

పీఎం కిసాన్ పథకం ప్రారంభమైన 2019 నుంచి ఇప్పటి వరకు 23 విడతల ద్వారా కోట్లాది మంది రైతులకు రూ.4.47 లక్షల కోట్లకు పైగా నిధులు వారి ఖాతాల్లో జమ అయ్యాయి.

ఎంతమందికి లబ్ధి?

ఈ పథకం ద్వారా మహిళా రైతులు కూడా భారీగా లబ్ధి పొందుతున్నారు. ఇప్పటివరకు మహిళా లబ్ధిదారులకు రూ.1 లక్ష కోట్లకు పైగా ఆర్థిక సాయం అందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. 

మహిళా రైతులకు కూడా

వ్యవసాయ ఖర్చులు తీర్చుకోవడం, విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో రైతుల నగదు ప్రవాహాన్ని మెరుగుపరచడం, ప్రైవేట్ అప్పులపై ఆధారపడకుండా చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు.

ఈ పథకం ప్రయోజనం

ఈ పథకం లబ్ధి పొందాలంటే రైతులు తప్పనిసరిగా e-KYC పూర్తి చేయాలి. ఆధార్-బ్యాంక్ ఖాతా లింకింగ్, అర్హత వివరాలు సరిగా ఉండాలి. ఈ పూర్తి వివరాలను ప్రభుత్వం తనిఖీలు కూడా నిర్వహిస్తోంది.

లబ్ధి పొందాలంటే

ఈ  పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగించడం వల్ల కోట్లాది రైతులకు ఆర్థిక భరోసా కొనసాగనుంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, రైతుల ఆదాయాన్ని పెంచడం దిశగా కేంద్రం ఈ నిర్ణయం.

రైతులకు భరోసా