AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాటర్ ట్యాంక్ క్లీనింగ్ ఎంత ఈజీనా.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే అవాక్కవ్వడం పక్కా..

ఇంట్లో వాటర్ ట్యాంక్ శుభ్రం చేయాలంటేనే భయపడుతున్నారా.. నీటిని కింద పారబోయలేక, ట్యాంక్ లోపలికి దిగి కడగలేక ఆ పనిని నెలల తరబడి వాయిదా వేస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. ఒక్క చుక్క మంచి నీటిని కూడా వృథా చేయకుండా, ట్యాంక్ లోపలికి దిగాల్సిన పని లేకుండానే.. కేవలం 20 నిమిషాల్లో అడుగున పేరుకుపోయిన మురికిని పారదోలే ఒక అద్భుతమైన దేశీ జుగాడ్ ట్రిక్ వచ్చేసింది.

వాటర్ ట్యాంక్ క్లీనింగ్ ఎంత ఈజీనా.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే అవాక్కవ్వడం పక్కా..
How To Clean Water Tank At Home
Krishna S
|

Updated on: Aug 02, 2026 | 2:28 PM

Share

ఇంట్లో నీటి ట్యాంక్ శుభ్రం చేయడం అనేది అత్యంత కష్టమైన, విసుగు పుట్టించే పనుల్లో ఒకటి. సాధారణంగా 500 లేదా 1000 లీటర్ల వాటర్ ట్యాంక్‌ను శుభ్రం చేయాలంటే.. అందులో ఉన్న నీటినంతా కిందకు పారబోయాల్సి వస్తుంది. దీనివల్ల వందలాది లీటర్ల మంచినీరు వృథా అవ్వడమే కాకుండా ట్యాంక్ లోపలకు దిగి కడగడం చాలా శ్రమతో కూడుకున్న పని. దాంతో చాలామంది ట్యాంక్ క్లీనింగ్‌ను నెలల తరబడి వాయిదా వేస్తుంటారు. అయితే నీటిని ఒక్క చుక్క కూడా వృథా చేయకుండా, ట్యాంక్ లోపలికి దిగకుండానే.. కేవలం 20 నిమిషాల్లో ట్యాంక్ అడుగున పేరుకుపోయిన మురికి, మట్టి, పాచిని సులభంగా తొలగించే ఒక అద్భుతమైన దేశీ జుగాడ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

ట్యాంక్ శుభ్రం చేసే ట్రిక్

చిట్కా కోసం మీకు మార్కెట్లో దొరికే ఖరీదైన పరికరాలు ఏవీ అవసరం లేదు. మన ఇంట్లోనే దొరికే కొన్ని సాధారణ వస్తువులతోనే ట్యాంక్ అడుగున ఉన్న మురికిని బయటకు లాగేయవచ్చు.

కావలసిన వస్తువులు..

  • ఒక పొడవాటి ప్లాస్టిక్ లేదా పివిసి పైపు
  • ఒక ప్లాస్టిక్ వాటర్ బాటిల్.
  • టేప్ లేదా దారము.

శుభ్రం చేసే విధానం

సక్షన్ పరికరం తయారు చేయడం: పాత ప్లాస్టిక్ వాటర్ బాటిల్ అడుగు భాగాన్ని కట్ చేయాలి. ఇప్పుడు బాటిల్ మూత భాగానికి పైపు కొనను గట్టిగా అమర్చి, నీరు లేదా గాలి బయటకు పోకుండా టేప్‌తో గట్టిగా సీల్ చేయాలి.

పైపులో నీటిని నింపడం: ఈ పైపు మొత్తాన్ని నీటితో నింపి, పైపు రెండో చివర బొటనవేలితో గట్టిగా మూసి ఉంచాలి.

సక్షన్ ప్రాసెస్ ప్రారంభించడం: బాటిల్ కట్ చేసిన వైపును ట్యాంక్ లోపల అడుగున ఉన్న మురికి దగ్గరకు తీసుకెళ్లాలి. ఇప్పుడు బయట ఉన్న పైపు కొనను ట్యాంక్ కంటే కింద ఎత్తులో ఉంచి, వేలు తీసేయాలి.

వ్యాక్యూమ్ ప్రభావం: సైఫన్ సూత్రం ప్రకారం.. పైపు ద్వారా నీరు బయటకు రావడం మొదలవుతుంది. మీరు ట్యాంక్ అడుగున ఉన్న మురికి, మట్టి ఉన్న చోట ఈ బాటిల్‌ జరుపుతుంటే.. ట్యాంక్‌లోని మంచి నీళ్లు వేస్ట్ కాకుండా కేవలం అడుగున ఉన్న మురికి, పాచి మాత్రమే వ్యాక్యూమ్ క్లీనర్ లాగా బయటకు వచ్చేస్తాయి.

ఈ పద్ధతి వల్ల కలిగే ఉపయోగాలు

నీటి పొదుపు: 1000 లీటర్ల మంచి నీటిని పారబోయాల్సిన అవసరం లేదు. కేవలం అడుగున ఉన్న 15-20 లీటర్ల మురికి నీరు మాత్రమే బయటకు పోతుంది.

శ్రమ తగ్గుతుంది: ట్యాంక్ లోపలికి దిగి రుద్దాల్సిన పని లేదు. బయట నిలబడే పైపు సహాయంతో శుభ్రం చేయవచ్చు.

సమయం ఆదా: కేవలం 15 నుండి 20 నిమిషాల్లో ట్యాంక్ అడుగు భాగం నీట్‌గా మారిపోతుంది.

ట్యాంక్ నీరు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండటానికి అదనపు టిప్స్..

బ్లీచింగ్ పౌడర్ లేదా పటిక: మురికి తీసేసిన తర్వాత ట్యాంక్ నీటిలో కొద్దిగా పటిక లేదా తగినంత బ్లీచింగ్ పౌడర్ కలపడం వల్ల నీటిలోని బ్యాక్టీరియా నశించి నీరు స్వచ్ఛంగా మారుతుంది.

మూత గట్టిగా ఉంచాలి: ట్యాంక్ మూత ఎప్పుడూ మూసి ఉంచాలి. గాలిలోని దుమ్ము, చెట్ల ఆకులు పడకుండా చూసుకుంటే తరచూ మురికి చేరకుండా ఉంటుంది.

నీటిని వృథా చేయకుండా, ఎక్కువ ఖర్చు లేకుండా ఇంట్లోనే ట్యాంక్‌ను క్లీన్ చేయడానికి ఈ దేశీ జుగాడ్ ట్రిక్ అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంటి వాటర్ ట్యాంక్‌ను కూడా ఈ సింపుల్ ట్రిక్‌తో క్షణాల్లో శుభ్రం చేసేయండి.

Follow Us