AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

With Love: 10 రోజుల్లో 25 కోట్లు..! దుమ్ము దులుపుతున్న విత్ లవ్‌ సినిమా కలెక్షన్స్‌

With Love: 10 రోజుల్లో 25 కోట్లు..! దుమ్ము దులుపుతున్న విత్ లవ్‌ సినిమా కలెక్షన్స్‌

Phani CH
|

Updated on: Feb 18, 2026 | 2:26 PM

Share

దర్శకుడిగా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత, అభిషన్ జీవింద్ 'విత్ లవ్' చిత్రంతో హీరోగానూ సంచలనం సృష్టించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సౌందర్య రజనీకాంత్ నిర్మించిన ఈ సినిమా పది రోజుల్లో ₹25 కోట్లకు పైగా వసూలు చేసి, త్వరలో ₹50 కోట్ల మార్క్‌ను అందుకోనుంది. అభిషన్ జీవింద్ తన తొలి చిత్రంతోనే హీరోగా బలమైన ముద్ర వేశారు.

టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో దర్శకుడిగా తెరంగేట్రం చేశాడు అభిషన్ జీవింద్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. దర్శకుడిగా సక్సెస్ అయిన ఇతడు.. ఇప్పుడు హీరోగానూ భారీ విజయాన్ని అందుకున్నాడు. అభిషన్ జీవింద్ హీరోగా డెబ్యూ చేసిన విత్ లవ్ మూవీ.. ఇప్పుడు మంచి రెస్పాన్స్‌తో.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్‌ను కుమ్మేస్తోంది. ఈ చిత్రంలో మలయాళ నటి అనశ్వర రాజన్ కథానాయికగా నటించింది. ఈ చిత్రాన్ని అభిషన్ జీవింద్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన మధన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రజనీకాంత్ కుమార్తె సౌందర్య నిర్మించగా.. సీన్ రోల్డాన్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజు నుంచే ఈ చిత్రానికి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. తొలి రోజు 2 కోట్లకు పైగా వసూలు చేసింది. సినిమా విడుదలైన 10 రోజులకు రూ. 25 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అంతేకాదు. ఇప్పటికీ థియేటర్లలో ఈ సినిమా హావా నడుస్తుంది. మరో నాలుగైదు రోజుల్లో ఈ చిత్రానికి రూ.50 కోట్లు రావడం ఖాయమని తెలుస్తోంది. అలాగే తొలి చిత్రంతోనే అభిషన్ జీవింద్ హీరోగా కూడా తనదైన ముద్ర వేశాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాటలో ఎవరికి ఎంత హక్కు ?? IPRS, PPL అంటే ఏంటి ??

ఈ ఆకులతో అద్భుత ప్రయోజనాలు.. ఆ సమస్యలు పరార్‌!

సిమ్‌ కార్డుల నుంచి బంగారం తీశాడు !! ఎలాగంటే

ఏరియా 51లోనే ఏలియన్స్‌ ?? అంతరిక్షంలో జీవం ఉంది !!

ఈ పక్షికి ఒళ్లంతా విషమే.. ముట్టుకుంటే మరణమే!

Follow Us