సిమ్ కార్డుల నుంచి బంగారం తీశాడు !! ఎలాగంటే
చైనాలో క్యో అనే వ్యక్తి సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయాడు. పాత సిమ్ కార్డులు, చిప్‌లు ఇతర ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి ఏకంగా 191 గ్రాముల స్వచ్ఛమైన బంగారాన్ని వెలికితీసి ఆశ్చర్యపరిచాడు. దీని విలువ 28 లక్షల రూపాయల వరకు ఉంటుంది. వీడియో చూసిన నెటిజన్లు అతన్ని ఆల్కెమిస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
చైనాలో క్యో అనే వ్యక్తి సోషల్ మీడియాలో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయాడు. పాత సిమ్ కార్డులు, చిప్‌లు ఇతర ఎలక్ట్రానిక్ వ్యర్థాల నుంచి ఏకంగా 191 గ్రాముల స్వచ్ఛమైన బంగారాన్ని వెలికితీసి ఆశ్చర్యపరిచాడు. దీని విలువ 28 లక్షల రూపాయల వరకు ఉంటుంది. వీడియో చూసిన నెటిజన్లు అతన్ని ఆల్కెమిస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీడియో వైరల్ కావడంతో చాలా మంది తమ ఇంట్లోని పాత సిమ్ కార్డులతో బంగారం తయారు చేయవచ్చని భావిస్తున్నారు. కానీ, క్యో ఇక్కడే ఒక విషయం చెప్పాడు. తాను సేకరించిన 191 గ్రాముల బంగారం కొన్ని సిమ్ కార్డుల నుంచి వచ్చింది కాదట. ఇందుకోసం 2 టన్నుల వరకు సిమ్ కార్డులు. చిప్ వ్యర్థాలు, పాత సర్క్యూట్ బోర్డ్‌లను ఉపయోగించినట్లు చెప్పాడు. సాధారణంగా ఒక సిమ్ కార్డులో 0.001 గ్రాము కంటే తక్కువ బంగారం ఉంటుంది. అంటే, క్యో తీసినంత బంగారం రావాలంటే కనీసం 4 లక్షల సిమ్ కార్డులు అవసరమవుతాయి. క్యో తన వీడియోలో పెద్ద పెద్ద కెమికల్ డ్రమ్ములను ఉపయోగించి బంగారం తీసాడు. ఆ ప్రక్రియలో ముందు తుప్పు పట్టించడం, తర్వాత డిస్‌ప్లేస్‌మెంట్, అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేయడం వంటి దశలు ఉన్నాయి. చివరగా వడపోత ద్వారా వచ్చిన గోల్డ్ మడ్ ను కరిగించి బిస్కెట్ రూపంలోకి మార్చాడు. అయితే, ఈ ప్రక్రియలో వాడిన అక్వా రెజియా అనే రసాయనం అత్యంత ప్రమాదకరమైనది. ఇది నైట్రిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ల మిశ్రమం. దీని నుంచి వెలువడే విష వాయువులు ప్రాణాపాయానికి దారితీస్తాయని క్యో హెచ్చరించాడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏరియా 51లోనే ఏలియన్స్ ?? అంతరిక్షంలో జీవం ఉంది !!
ఈ పక్షికి ఒళ్లంతా విషమే.. ముట్టుకుంటే మరణమే!
సముద్రంలో సరదా విహారం.. ప్రాణాల మీదికొచ్చింది..
Prabhas: దెబ్బ మీద దెబ్బకు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న ప్రభాస్
కోటిన్నరకు భర్తను అమ్మేసిన భార్య.. కారణం ఇదే !! మహానుభావురాలు
ఇదెక్కడి వాతావరణం.. ఇక్కడేమో ఎండలు.. అక్కడేమో వర్షాలు
రైల్వే ట్రాక్‌ను కమ్మేసిన పొగ..నిలిచిపోయిన రైలు
ఆ దేశంలో ఆఫీసులు .. స్వర్గానికి స్పాట్లు
వీళ్లు మనుషులేనా.. పెళ్లిలోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు కదా!
గబ్బిలాల్లో కొత్త కరోనావైరస్.. ముప్పు తప్పదా?
ఏలియన్స్ నిజంగా ఉన్నారా? ఆ సీక్రెట్ ఫైల్స్‌లో ఏముంది?
ఇంటి బయట నిద్రించిన బాలుడు.. కాటేసిన కట్లపాము, రక్తపింజర.. చివరకు

