Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ బుకింగ్స్ ఓపెన్.. నైజాంలో టికెట్ ధరలు ఎలా ఉన్నాయంటే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. చాలా కాలంగా రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. ఇటీవలే ఓజీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ఉగాది పండక్కి థియేటర్లలో సందడి చేయబోతున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఓజీ సూపర్ హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. గబ్బర్ సింగ్ వంటి సంచలనం తర్వాత పవన్, హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు ఎక్కువే ఉన్నాయి. ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఉగాది పండగ సందర్భంగా ఈ చిత్రాన్ని మార్చి 19న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నైజాంలో ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ మేరకు తెలంగాణలో గురువారం ఉదయం 7.30కే షో పడనుంది.
ఎక్కువమంది చదివినవి : Jabardasth Naresh: నెలకు 13 ఈవెంట్స్ చేస్తా.. ఒక్కో ఈవెంట్‌కు ఎంత తీసుకుంటానంటే.. జబర్దస్త్ నరేష్..
ప్రస్తుతానికి టికెట్ ధరల పెంపు లేదు. రెగ్యులర్ రేట్లకే టికెట్స్ ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి. బుకింగ్స్ ఓపెన్ అయిన క్షణాల్లోనే టికెట్స్ భారీగా అమ్ముడయ్యాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురువారం తెల్లవారుజామున 4 గంటల తర్వాత బెనిఫిట్ షో ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దాని టికెట్ ధరను రూ.500 (పన్నులతో కలిపి)గా నిర్ణయించారు. అలాగే సినిమా విడుదల నాటి నుంచి పది రోజులపాటు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. సింగిల్ స్క్రీన్ లలో రూ.100, మల్టీప్లెక్స్ లలో రూ.125 చొప్పున పెంచుకునే అవకాశమిచ్చింది.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లును సుడిగాలి సుధీర్‌కు అమ్మేశా.. టాలీవుడ్ నటుడు..
ఇప్పటికే ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలరించనున్నారు పవన్. ఈ చిత్రానికి చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా.. చివరి నిమిషంలో మరో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చి చేశారు.
ఎక్కువమంది చదివినవి : Tollywood : ఆమెకు 15.. అతడికి 24.. పదేళ్లుగా సీక్రెట్ లవ్.. కట్ చేస్తే.. భార్యభర్తలుగా ఒక్కటైన హీరోహీరోయిన్..
ఎక్కువమంది చదివినవి : Appa Rao: ఆ సినిమా సమయంలో చేసిన పని.. నా ఫేస్ మొత్తం బ్లాక్ అయ్యింది.. జబర్దస్త్ అప్పారావు..
