AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లును సుడిగాలి సుధీర్‏కు అమ్మేశా.. టాలీవుడ్ నటుడు..

ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి తన సినీ జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను, ఇతర కళాకారులకు అందించిన సహాయాన్ని వివరించారు. ఎందరో సింగర్లకు, ఆర్టిస్టులకు, యాంకర్లకు తన సహాయం అందించి, వారికి ఇళ్లు, కార్లు కొనుక్కోవడానికి తోడ్పడినట్లు తెలిపారు. కార్యక్రమాలకు ఆర్టిస్టులను తీసుకెళ్ళినప్పుడు మార్కెట్ ధర కంటే ఎక్కువ చెల్లించేవారని, తద్వారా వారు సంతోషంగా పనిచేసి తన పేరు నిలబెట్టారని పేర్కొన్నారు.

Tollywood : ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లును సుడిగాలి సుధీర్‏కు అమ్మేశా.. టాలీవుడ్ నటుడు..
Sudigali Sudheer
Rajitha Chanti
|

Updated on: Mar 16, 2026 | 10:47 AM

Share

టాలీవుడ్ నటుడు, ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి ఒకప్పుడు పలు చిత్రాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ చాలా కాలంగా సినిమాల్లో కనిపించడం లేదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న అనేక అనుభవాలను, సవాళ్లను, ఇతర కళాకారులకు అందించిన సహాయాన్ని పంచుకున్నారు. తన కెరీర్ ప్రారంభ దశలో ఎంతోమందికి సినిమా అవకాశాలు, స్టేజ్ షోలు ఇప్పించినట్లు, వారిని తన కారులో తీసుకెళ్లి ప్రోగ్రాములలో జోక్స్ ఎలా చేయాలనేది నేర్పించినట్లు తెలిపారు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు ఇప్పుడు వచ్చినా, తాను అంతకు ముందే కమెడియన్లను, ఆర్టిస్టులను తీసుకెళ్లి జుగల్బందీ తరహా ప్రోగ్రామ్స్ చేసేవాడినని గుర్తు చేసుకున్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..

తన సహాయం వల్ల ఎంతోమంది ఇళ్లు కట్టుకున్నామని, ఇంటి లోన్లు తీర్చుకున్నామని, కార్లు, ఫ్లాట్లు కొనుక్కున్నామని చెప్పడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని శివారెడ్డి అన్నారు. ఒక ఆర్టిస్ట్‌కు స్టేజ్ షోకు రూ.25,000 ఇస్తే, తాను రూ.30,000, సింగర్‌కు రూ.15,000 ఇస్తే రూ.16,000-18,000 చెల్లించేవాడినని వెల్లడించారు. ఇది డబ్బులు ఎక్కువ ఉన్నాయని కాదని, తమను మళ్లీ పిలిచినప్పుడు వారికి తమకు ప్రాముఖ్యత ఇచ్చి, సంతోషంగా పనిచేసి ప్రోగ్రామ్ విజయవంతం చేయాలనే ఉద్దేశంతోనే అలా చేసేవాడినని వివరించారు. అప్పట్లో తను బ్యాచిలర్‌గా ఉండడంతో డబ్బుకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదని, భవిష్యత్తు కోసం ఆస్తులు కూడబెట్టాలనే ఆలోచన లేదని పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Actress : డబ్బు కోసమే అలాంటి సినిమాల్లో నటించా.. ఓపెన్‏గా చెప్పేసిన హీరోయిన్..

నటుడిగా అవకాశాల కోసం తాను నిరంతరం ప్రయత్నిస్తున్నానని శివారెడ్డి తెలిపారు. దర్శకుడు శ్రీను వైట్ల నుండి “దూకుడు” సినిమా తర్వాత అవకాశాలు రాలేదని, తన టీమ్‌లోని గోపి మోహన్‌కు ఇప్పటికీ అవకాశాల కోసం మెసేజ్‌లు పెడుతూనే ఉంటానని చెప్పారు. అయితే, కొంతమంది దర్శకులు “నెక్స్ట్ ఇయర్”, “నెక్స్ట్ సినిమా” అని చెప్పి కాలం వెళ్ళదీస్తుంటారని, మరికొందరు సినిమా ఫెయిల్ అయ్యాకే స్పందిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. అవకాశాల కోసం ఆఫీస్‌లకు వెళ్తే “మీరెందుకు వచ్చారు, ఫోన్ చేస్తే సరిపోతుంది కదా” అంటారని, ఫోన్ చేస్తే “నేను చెప్తానులే” అని తీసిపారేస్తారని, ఇది చాలా సతమతం చేస్తోందని అన్నారు. అయినప్పటికీ మంచితనం, కష్టపడే గుణం ఎప్పటికైనా గెలుస్తాయని తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

తన మిమిక్రీ ఇమేజ్ నటన అవకాశాలను డామినేట్ చేస్తోందని శివారెడ్డి అభిప్రాయపడ్డారు. తన విషయంలో మిమిక్రీ ఆర్టిస్ట్‌గా వచ్చిన పేరు నటుడిగా తనను గుర్తించడానికి అడ్డంకిగా మారిందని అన్నారు. తనకు ఒక కమెడియన్ పాత్ర అవసరమైనప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్‌గా గుర్తించి పిలుస్తారని, నటుడిగా తనను గుర్తించడం లేదని వాపోయారు. తన ఇంటి గురించి చాలామంది ప్రస్తావిస్తుంటారని, అయితే సుడిగాలి సుధీర్ వంటి కమెడియన్లు కూడా రెండేసి, మూడేసి ఇళ్లు కలిగి ఉన్నారని అన్నారు. సుడిగాలి సుధీర్ తన దగ్గర మొదటి ఫ్లాట్‌ను చాలా తక్కువ ధరకే కొన్నాడని, ఆ ఫ్లాట్‌లో అవార్డులు పెట్టుకోవడానికి ఎస్ ఆకారంలో ఇంటీరియర్స్ చేయించానని, అది శివారెడ్డి ఎస్ అనుకుంటే, సుడిగాలి సుధీర్ ఎస్ అయిందని సరదాగా చెప్పుకొచ్చారు. ఆర్థికంగా తాను ఎన్నో కష్టాలను అనుభవించిన తర్వాతే డబ్బు విలువ తెలుసుకొని, రూపాయి రూపాయి కూడబెట్టి ఇల్లు కొనుక్కున్నానని శివారెడ్డి తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : సీరియల్స్‏లో లక్షల్లో సంపాదన.. శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే..

Follow Us
పేద విద్యార్ధులు యేటా రూ.48 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
పేద విద్యార్ధులు యేటా రూ.48 వేలు పొందే ఛాన్స్.. దరఖాస్తు లింక్
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో