AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harish Shankar : నా దేవుడు ఆయనే.. కష్టాల్లో కుంగిపోతే ఆదుకున్నారు.. హరీష్ శంకర్ ఎమోషనల్ స్పీచ్..

గబ్బర్ సింగ్ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఉగాది పండగ సందర్భంగా ఈ సినిమాను మార్చి 19న రిలీజ్ చేస్తున్నారు.

Harish Shankar : నా దేవుడు ఆయనే.. కష్టాల్లో కుంగిపోతే ఆదుకున్నారు.. హరీష్ శంకర్ ఎమోషనల్ స్పీచ్..
Harish Shankar
Rajitha Chanti
|

Updated on: Mar 16, 2026 | 9:11 AM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఓజీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ నుంచి వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ అంచనాలు పెంచేసింది. గబ్బర్ సింగ్ వంటి సంచలన విజయం తరువాత డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసతున్నారు. గాది కానుగా మార్చి 19వ తేదీన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ పవన్ గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

హరీష్ శంకర్ మాట్లాడుతూ.. “ముందుగా ఈ సినిమా ఎందుకు ఆలస్యమైంది అనేది నేను మీతో పంచుకుంటాను. మొదట కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఖుషికి కొనసాగింపు లాంటి కథ అనుకున్నాము. కాలేజ్ సమయంలో ఇగోతో విడిపోయిన ఇద్దరు స్టూడెంట్స్.. అదే ఇగోతో కాలేజ్ లో లెక్చరర్స్ గా జాయిన్ అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో కథ అనుకున్నాం. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల కథ మార్చడం జరిగింది. కోవిడ్ కూడా కొంత ప్రభావం చూపించింది. అందరూ ఈ సినిమాను చాలా వేగంగా పూర్తి చేశాను అంటున్నారు. ఈ సినిమా ఆలస్యానికి నేనే కారణం, వేగంగా షూటింగ్ పూర్తి కావడానికీ నేనే కారణం. ఈ ప్రయాణంలో మా నిర్మాతలు నవీన్ గారు, రవి గారు నన్ను భుజాల మీద మోశారు. గుండెల్లో పెట్టుకున్నారు. ఏ దర్శకుడికైనా డ్రీమ్ ప్రొడ్యూసర్స్ వీళ్ళు. సినిమా కోసం అడిగిన దానికంటే ఎక్కువే ఇస్తారు. కాలరే ఎత్తరా సాంగ్ కోసం మైత్రి కెరీర్ లోనే అతి పెద్ద సెట్ వేశారు. ఆనంద్ సాయి గారు అద్భుతమైన సెట్ లు వేశారు.

ఎక్కువమంది చదివినవి : Actress : మగాళ్ల నుంచి నన్ను నేను కాపాడుకోలేకపోయాను.. టాలీవుడ్ నటి కామెంట్స్ వైరల్..

కథ మారినా, నా గురించి బయట కథలుకథలుగా చెప్పుకున్నా.. రెండున్నరేళ్లు నాతో కలిసి ప్రయాణం చేసిన దశరథ్ గారికి గారికి కృతఙ్ఞతలు. అలాగే మా రమేష్ రెడ్డి గారికి, ప్రవీణ్ వర్మ, చంద్ర మోహన్ గారికి కూడా కృతఙ్ఞతలు. తెర మీద హీరో పవన్ కళ్యాణ్ గారైతే, తెర వెనుక హీరో దేవి శ్రీ ప్రసాద్ గారు. అద్భుతమైన పాటలు అందించారు. అలాగే థమన్ గారి నేపథ్య సంగీతం కూడా అద్భుతంగా ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల కోరిక మేరకే ఈ సినిమాను ముందుగా ఉగాదికి తీసుకొస్తున్నాము. ఈసారి ఉగాది.. ఉస్తాద్ ఉగాది. పార్థిబన్ గారు, కె.ఎస్. రవికుమార్ గారు ఈ సినిమాలో గొప్ప పాత్రలు చేశారు. శ్రీలీల గారు అనగానే అందరికీ డ్యాన్స్ లు గుర్తుకొస్తాయి. అయితే ఇందులో ఆమె పర్ఫార్మెన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ లు ఈ సినిమాలో చూస్తారు. నిద్ర కూడా మాని సినిమా కోసం పని చేస్తున్న మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి ధన్యవాదాలు. కోవిడ్ సమయంలో మానసికంగా చాలా కృంగిపోయి ఉన్నప్పుడు.. నా దేవుడు పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిచి షూటింగ్ ప్లాన్ చేసుకో అన్నారు. అప్పటినుంచి ఎంతో ఉత్సాహంతో ఈ సినిమా చేశాము. ఆయన పరుగెత్తారు, మమ్మల్ని పరుగెత్తించారు. గబ్బర్ సింగ్ లో ఒక డైలాగ్ ఉంటుంది. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు అని. ఇప్పుడు డైలాగ్ మార్చుకున్నాను. కమిట్ మెంట్ ఉన్నోడికి కటౌట్ ఉంటుంది.

ఎక్కువమంది చదివినవి : Tollywood : నా శరీర ఆకృతి కారణంగా రోజూ నరకం అనుభవిస్తున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..

ఆయన కటౌట్ ని మన అందరి గుండెల్లో పెట్టుకున్నాము. నా గుండె లోపల పవన్ కళ్యాణే, నా గుండె బయట పవన్ కళ్యాణే, నా గుండె ధైర్యం పవన్ కళ్యాణే. పగలు ప్రజాసేవలో ఉండి, రాత్రుళ్ళు సినిమా షూటింగ్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు ప్రాణం పెట్టి పనిచేశారు. మార్చి 19న థియేటర్లలో కలుద్దాం. ఉస్తాద్ ఉగాది జరుపుకుందాం.” అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Actress : డబ్బు కోసమే అలాంటి సినిమాల్లో నటించా.. ఓపెన్‏గా చెప్పేసిన హీరోయిన్..

ఎక్కువమంది చదివినవి : సీరియల్స్‏లో లక్షల్లో సంపాదన.. శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే..

Follow Us