AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్‌లో పూనకాలు తెప్పిస్తున్న ఆ మూడు సీన్స్ ఏంటో తెలుసా..?

డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటేస్ట్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్ ’. భారీ అంచనాల మధ్య ఉగాది సందర్భంగా మార్చి 19న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్, పవర్ స్టార్ కాంబోలో సినిమా కావడంతో ఈ మూవీపై ముందు నుంచి అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్‌లో పూనకాలు తెప్పిస్తున్న ఆ మూడు సీన్స్ ఏంటో తెలుసా..?
Ustaad Bhagat Singh
Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Mar 20, 2026 | 8:13 PM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ అనగానే అభిమానుల్లో అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గబ్బర్ సింగ్ మ్యాజిక్‌ను రిపీట్ చేస్తూ వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర తనదైన మార్క్ చూపిస్తోంది. ఓవరాల్‌గా ఇదొక అద్భుతమైన క్లాసిక్ అని చెప్పలేం కానీ… మాస్ ఆడియన్స్‌కు మాత్రం కిక్ ఇచ్చే కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. సినిమా చూస్తున్నంత సేపు ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించే మూడు ప్రధాన సన్నివేశాలు థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్నాయి. పవన్ ఆటిట్యూడ్, హరీష్ మార్క్ టేకింగ్ కలగలిపి పండగ సీజన్‌లో ఈ సినిమా మాస్ జాతరను తలపిస్తోంది. సినిమా ఫస్టాఫ్‌లో వచ్చే పాతబస్తీ ఎపిసోడ్ ఆడియన్స్‌కు ఫుల్ మీల్స్ పెడుతుంది.

ఆ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు అవమానించారు.. షూటింగ్ నుంచి ఏడ్చుకుంటూ వెళ్లా..

ఈ సీన్‌లో పవన్ కళ్యాణ్ డైలాగ్ డెలివరీ, స్వాగ్ వేరే లెవెల్‌లో ఉంటాయి. పాతబస్తీకి వెళ్లే ముందు హీరోకి పక్కన ఉన్నవాళ్లు “బొట్టు పెట్టుకుంటే మంచిది సార్” అని సలహా ఇస్తారు. దానికి బదులుగా ఉస్తాద్.. “నేనెళ్లేది పాతబస్తీకి.. పాకిస్తాన్‌కి కాదు” అని చెప్పే డైలాగ్ థియేటర్లలో విజిల్స్ వేయిస్తోంది. ఏమాత్రం బెదురు లేని పోలీస్ ఆఫీసర్‌గా పవన్ చెప్పే ఈ పవర్‌ఫుల్ డైలాగ్, ఆ ఎపిసోడ్ మొత్తం నడిచే ఇంటెన్స్ డ్రామా ఫస్టాఫ్‌కే హైలైట్‌గా నిలిచాయి. ఇక సెకండాఫ్‌కి వచ్చేసరికి వింటేజ్ పవన్‌ను గుర్తుచేసేలా అదిరిపోయే మ్యూజికల్ ట్రీట్ ప్లాన్ చేశారు. ‘తొలిప్రేమ’ సినిమాలోని ఎవర్ గ్రీన్ హిట్ “ఈ మనసే.. సే.. సే..” సాంగ్‌ను రీమిక్స్ చేసిన విధానం థియేటర్లలో కేక పుట్టిస్తోంది. ఆ పాత పాటలోని నాస్టాల్జిక్ ఫీల్ మిస్ కాకుండా, దానికి మోడ్రన్ బీట్స్ యాడ్ చేసి ప్రెజెంట్ చేసిన తీరు ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది.

ఏంటి భయ్యా.. ఈ సిరీస్ ఇలా ఉంది..!! ఓటీటీని ఊపేస్తోంది.. ఎక్కడ చూడొచ్చంటే

స్క్రీన్ మీద పవన్ ఎనర్జిటిక్ స్టెప్పులు చూస్తుంటే పాత రోజులు గుర్తొచ్చి ఫ్యాన్స్ సీట్లలో కూర్చోవడం లేదు. ఈ రీమిక్స్ ట్రాక్ సినిమాకి ఒక స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ మ్యూజికల్ బ్లాస్ట్‌కి కంటిన్యూయేషన్‌గా వచ్చిన ‘తరలిరాదా తన వసంతం’ రీమిక్స్ కూడా అదరగొట్టింది. పాట విజువల్స్, ప్లేస్మెంట్ పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యాయి. ఆ తర్వాత కథ క్లైమాక్స్‌కి చేరుకునే సరికి యాక్షన్ డోస్ పీక్స్‌కి వెళ్తుంది. హరీష్ శంకర్ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్‌ను చాలా పవర్‌ఫుల్‌గా, స్టైలిష్‌గా డిజైన్ చేశాడు. విలన్స్‌ను ఉతికి ఆరేసే మాస్ ఫైట్స్, దానికి తోడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ కలిసి ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. భారీ యాక్షన్‌తో ముగిసే ఈ క్లైమాక్స్ బ్లాక్ ఆడియన్స్ చేత చప్పట్లు కొట్టిస్తోంది.

ఇవి కూడా చదవండి

Actress : రెండు పెళ్లిళ్లు.. మరో ఇద్దరితో ప్రేమాయణం..!! కట్ చేస్తే తనకన్నా 13 ఏళ్లుపెద్ద వాడితో….

మొత్తంగా విశ్లేషిస్తే.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కంటెంట్ పరంగా ఇండస్ట్రీని షేక్ చేసేంత సూపర్ సినిమా కాకపోవచ్చు. కానీ ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోయే పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ డైలాగ్స్ వల్ల బి, సి సెంటర్స్ ఆడియన్స్‌లోకి ఈ సినిమా బాగానే చొచ్చుకుపోతోంది. లాజిక్స్ పక్కనపెట్టి, పండక్కి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో కలిసి థియేటర్‌లో హాయిగా చూసి ఎంజాయ్ చేయడానికి ఎలాంటి డోకా లేని సినిమా ఇది. ఉగాది హాలీడేస్ ఉన్నాయి.. రంజాన్ సెలవులు కూడా వచ్చాయి.. మరో మూడు రోజుల వీకెండ్ బాకీ ఉంది.. ఇవన్నీ కలిపి సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యేలాగే కనిపిస్తుంది. అదే జరుగుతుందని నమ్మకంగా చెప్తున్నారు మేకర్స్ కూడా..!

OTT Movie : ముగ్గురు భామలు, వణికించే సీన్స్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us