AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పవన్ కళ్యాణ్ మాస్ రాంపేజ్.. ఉస్తాద్ భగత్ సింగ్’ ఇన్‌సైడ్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి పవర్ స్టార్ మేనియాతో ఊగిపోతున్నాయి. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉగాది కానుకా మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా సాంగ్స్, ట్రైలర్ కు అభిమానుల నుంచి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.

పవన్ కళ్యాణ్ మాస్ రాంపేజ్.. ఉస్తాద్ భగత్ సింగ్' ఇన్‌సైడ్ రిపోర్ట్
Ustad Bhagat Singh
Rajeev Rayala
|

Updated on: Mar 17, 2026 | 7:24 AM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెండితెరపై కనిపిస్తే ఆ పూనకమే వేరు. ఇక ఆయన పక్కా మాస్ అవతార్‌లో కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ మూవీగా ఉన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి అందుతున్న తాజా సమాచారం మెగా అభిమానుల్లో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తోంది. చిత్ర వర్గాల నుంచి అందుతున్న ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షోగా సాగనుందని తెలుస్తోంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ తన వింటేజ్ మాస్ లుక్‌లోకి మారిపోయారు. సినిమా నిడివి ఉన్న రెండున్నర గంటల పాటు ఆయన విశ్వరూపం చూపించబోతున్నారట. కేవలం యాక్షన్ మాత్రమే కాదు… కామెడీ, ఎమోషన్, డ్యాన్స్, మరియు రొమాంటిక్ సీన్స్‌లో కూడా తనదైన మార్కును చూపిస్తూ పవన్ ఆకట్టుకోనున్నారని టాక్.

దర్శకుడు హరీష్ శంకర్, పవన్ బాడీ లాంగ్వేజ్‌ను పక్కాగా వాడుకోవడంలో సిద్ధహస్తుడు. ఈ చిత్రంలో కూడా అడుగడుగునా ఫ్యాన్స్‌కు కావాల్సిన ‘హై’ ఇచ్చే అంశాలను జోడించారు. పవన్ ఎంట్రీ సీన్ థియేటర్లలో ఈలలు వేయించేలా డిజైన్ చేశారు. పవర్ ఫుల్ ఫైట్ సీక్వెన్స్ లు మాస్ ఆడియన్స్‌కు విజువల్ ఫీస్ట్‌గా ఉంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్లు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం. సినిమాలో ఉన్న రెండు మాస్ సాంగ్స్ థియేటర్లను షేక్ చేయడం ఖాయమని అంటున్నారు. డైలాగ్స్ రాయడంలో హరీష్ శంకర్ స్టైలే వేరు. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు సరిపోయేలా పవర్ ఫుల్ డైలాగ్స్, ఎమోషన్స్, మరియు వినోదాన్ని మేళవించి కథను ఆసక్తికరంగా మలిచారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ వర్సటైల్ యాక్టింగ్‌ను పూర్తిస్థాయిలో వాడుకుంటూ, ఈ సినిమాను ఒక కంప్లీట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దారు. మొత్తానికి, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఇది పక్కా పూనకాలు తెచ్చే సినిమా అని చెప్పడంలో సందేహం లేదు!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు