Pawan Kalyan: భారీగా పెరిగిన ఉస్తాద్ అంచనాలు.. కలెక్షన్ల సునామీ ఖాయమా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. మొదట్లో ఈ ప్రాజెక్ట్‌పై పెద్దగా హైప్ లేకపోయినా, షూటింగ్ ఆలస్యం మరియు పవన్ రాజకీయాల వల్ల సినిమా వస్తుందా అన్న సందేహాలు వచ్చాయి. అయితే ఇప్పుడు రిలీజ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఫ్యాన్స్‌లో ఆసక్తి, అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా థియేటర్లలోకి వస్తుందంటే ఆ వైబ్రేషనే వేరు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలో పరిస్థితులు రోజురోజుకూ మారిపోతూ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి. ఈ సినిమాపై అంచనాలు అనూహ్యంగా, అమాంతం పెరిగిపోతున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే అంతే.. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ఆటోమేటిక్‌గా ఎక్స్‌పెక్టేషన్స్ తారాస్థాయికి చేరుకుంటాయి. ఇప్పుడు ఉస్తాద్ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతోంది. సినిమా ఎలా ఉండబోతోందో అన్న క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో విపరీతంగా పెరిగిపోయింది. నిజానికి ఈ ప్రాజెక్ట్ మొదలైన కొత్తలో దీనిపై జనాల్లో పెద్దగా అంచనాలు లేవు. పైగా షూటింగ్ మధ్యలో చాలాసార్లు ఆగిపోవడం, రాజకీయాలతో పవన్ బిజీ అవ్వడంతో సినిమా ఇక రాదేమో అని అందరూ అనుకున్నారు.
దీనికి తోడు మొదట ‘భవదీయుడు భగత్ సింగ్’గా అనౌన్స్ చేసిన టైటిల్ కాస్తా.. తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’గా మారిపోయింది. ఇలా ఎన్నో అవాంతరాలు, వాయిదాలు చూసి ఈ ప్రాజెక్ట్‌పై బజ్ క్రియేట్ అవ్వడం కష్టమేమో అని అంతా భావించారు. కానీ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో టైమ్ వచ్చినప్పుడు కానీ బయటపడదు అని మరోసారి ప్రూవ్ అయింది. సినిమా ప్రమోషన్స్ మొదలైన తర్వాత కూడా మొన్నటి వరకు ఒక మోస్తరు హైప్ మాత్రమే నడిచింది. పాటలు విడుదలైనప్పుడు కూడా యావరేజ్ రెస్పాన్స్ మాత్రమే వచ్చింది. కానీ ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో.. అంచనాలు ఒక్కసారిగా డబుల్ అయిపోయాయి. ట్రైలర్‌లో పవన్ స్వాగ్, పవర్‌ఫుల్ డైలాగ్స్ చూశాక సినిమాపై ఆసక్తి సగం పెరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో అయితే ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశాన్ని దాటేశాయి.
మీద పవన్ ఎనర్జీ, డైరెక్టర్ కాన్ఫిడెన్స్ చూశాక థియేటర్లు దద్దరిల్లడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ ఫుల్ క్లారిటీకి వచ్చేశారు. కేవలం క్రేజ్ మాత్రమే కాదు, బిజినెస్ పరంగానూ ఉస్తాద్ భగత్ సింగ్ ట్రేడ్ వర్గాల్లో దుమ్ము దులిపేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు ఏకంగా రూ.130 కోట్ల మేర భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. మొదట్లో ఉన్న సైలెన్స్ అంతా పటాపంచలైపోయి, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు సైతం భారీ రేట్లు వెచ్చించి మరీ రైట్స్ సొంతం చేసుకోవడానికి క్యూ కట్టారు. పవన్ కళ్యాణ్ మార్కెట్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని చెప్పడానికి ఈ రూ.130 కోట్ల బిజినెస్ ఫిగర్ ఒక రేంజ్ ఎగ్జాంపుల్ అని విశ్లేషకులు చెబుతున్నారు. వీటన్నింటికీ మించి సగటు ప్రేక్షకుడిని, అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్న మరో ప్రధాన అంశం.. ‘గబ్బర్ సింగ్’ కాంబినేషన్ రిపీట్ అవ్వడం.
పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను ఎలా షేక్ చేసిందో ఎవరూ మర్చిపోలేరు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఆ బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్ అవుతుండటంతో ఉస్తాద్ భగత్ సింగ్‌పై ఎక్కడలేని హైప్ క్రియేట్ అయింది. అదే ఎనర్జీ, అదే మాస్ ఎలివేషన్స్‌తో ఉస్తాద్ థియేటర్లలోకి ఎంట్రీ ఇస్తే.. కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. అన్నింటికి మించి ఈ ఉగాది సందర్భంగా మార్చి 19న విడుదల అవుతున్న ఒకే ఒక్క తెలుగు సినిమా ఉస్తాద్ మాత్రమే. థియేటర్స్ పరంగా కూడా ఎక్కడా ఏ ఇష్యూ లేదు.. ఒక్కసారి పాజిటివ్ టాక్ వచ్చిందంటే మాత్రం అస్సలు ఆగేదే లేదన్నట్లు పవన్ రెచ్చిపోతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. చూడాలిక.. ఏం జరగబోతుందో..?
