సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం ఎస్బిఐ నుంచి నరసింహారెడ్డి డ్రా చేసిన రూ. 8 లక్షలను సినిమా స్టైల్లో బైక్ డిక్కీ నుంచి అపహరించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.