AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బుర్ర పేలిపోయే ట్విస్ట్..! సమంత, నాగ చైతన్య, శోభిత కలిసి ఒకే సినిమాలో.. అది కూడా బ్లాక్ బస్టర్ మూవీ

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు చైతూ. రీసెంట్ గా తండేల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మత్యకారుడిగా కనిపించాడు నాగ చైతన్య.

బుర్ర పేలిపోయే ట్విస్ట్..! సమంత, నాగ చైతన్య, శోభిత కలిసి ఒకే సినిమాలో.. అది కూడా బ్లాక్ బస్టర్ మూవీ
Samantha Naga Chaitanya, shobitha
Rajeev Rayala
|

Updated on: Jun 28, 2025 | 3:15 PM

Share

అక్కినేని నాగ చైతన్య రీసెంట్ శోభితను పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. వీరి వివాహం హైరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది. గతకొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత ఆలయాలకు వెళ్తూ బిజీగా ఉన్నారు. అయితే నాగ చైతన్య శోభిత కంటే ముందు సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చైతన్య, సమంత కలిసి ఏ మాయ చేసావే సినిమాలో నటించారు. ఆ సినిమా సమయంలోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆతర్వాత కూడా కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. అయితే అనుకోని కారణాల వల్ల సమంత, నాగచైతన్య విడిపోయారు. స్టార్ కపుల్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న సామ్, చై విడిపోవడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.

ఇది కూడా చదవండి : దీన స్థితిలో టాలీవుడ్ కమెడియన్..! నీ ముఖం కూడా గుర్తులేదంటూ అవమానాలు

సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు సమంత, చైతన్య. ఇక విడిపోయిన తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీగా మారిపోయారు. సమంత మాయోసైటిస్ బారిన పడటంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంది. ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీగా మారిపోయింది. మరో వైపు నాగ చైతన్య తన సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఈ క్రమంలోనే శోభిత దూళిపాళ్ళతో ప్రేమలో పడ్డాడు. శోభిత, నాగ చైతన్య కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు.

ఇది కూడా చదవండి : 400 కోట్ల హీరోయిన్.. కానీ ఇప్పటికీ అద్దె ఇంట్లోనే.. కారణం ఇదేనా..?

కానీ సమంత, నాగచైతన్య, శోభిత కలిసి ఓ సినిమాలో నటించారని తెలుస్తుంది. ఇప్పుడు ఇదే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది. ఆ సినిమా ఎదో తెలుసా.? కల్ట్ క్లాసిక్ గా నిలిచినా మజిలీ. శివ నిర్వాణం దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో ముందుగా దివ్యాంక కౌశిక్ పాత్రకు శోభితను అనుకున్నాడట దర్శకుడు. శోభితతో రెండు మూడు సీన్స్ కూడా షూట్ చేశారట.. ఆతర్వాత కొన్ని కారణాలతో ఆమె సినిమా నుంచి తప్పుకుందని తెలుస్తుంది. దాంతో ఆమె ప్లేస్ లోకి దివ్యాంక కౌశిక్ ను తీసుకున్నారట. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో. అలాగే ఫిలిం సర్కిల్స్ లో వైరల్ గా మారింది. మజిలీ సినిమా నాగ చైతన్య కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : హిట్ కొట్టి ఆరేళ్ళు.. మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్.. కానీ క్రేజ్ మాత్రం పీక్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us