AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మాయిలు ఈ మూవీని మిస్ అవ్వొద్దు.. శోభిత మెచ్చిన కాంట్రవర్సీ సినిమా.. ఇప్పుడు ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో

అక్కినేని నాగచైతన్య సతీమణి శోభిత ధూళిపాళ్ల ఓ సినిమాపై ప్రశంసలు కురిపించింది. అమ్మాయిలందరూ కచ్చితంగా ఈ మూవీని చూడాలని సూచించింది. శోభిత మెచ్చిన ఈ మూవీ రిలీజ్ కు ముందే ఎన్నో వివాదాలు ఎదుర్కొంది. అయితే ఇప్పుడు ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో దూసుకెళుతోంది.

అమ్మాయిలు ఈ మూవీని మిస్ అవ్వొద్దు.. శోభిత మెచ్చిన కాంట్రవర్సీ సినిమా.. ఇప్పుడు ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో
Sobhita Dhulipala
Basha Shek
|

Updated on: Nov 11, 2025 | 6:27 PM

Share

గత వారం ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు, ఆసక్తి కర వెబ్ సిరీస్‌లు వచ్చాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన డబ్బింగ్ సినిమాలు, సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఇందులో ఒక సినిమా మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. థియేటర్లలో రిలీజ్ కు ముందు ఎన్నో వివాదాలు ఎదుర్కొన్న ఈ కాంట్రవర్సీ మూవీ ఇప్పుడు ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో దూసుకెళుతోంది. పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాను చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా అక్కినేని కోడలు, నాగ చైతన్య సతీమణి శోభిత ఈ కాంట్రవర్సీ మూవీని చూసింది. అనంతరం సినిమాపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ సినిమా నన్ను నవ్వించింది.. ఏడిపించింది.. చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసిన అనుభూతి కలిగించింది. ఈ సినిమాను అందరూ తప్పకుండా చూడాలి. మరీ ముఖ్యంగా అమ్మాయిలు ఈ సినిమాను మిస్ అవ్వొద్దు.. ఇది మనకోసం తీసిన సినిమా.. ఇందుకు వర్ష భరత్, అంజలి శివరామన్‪‌ని అభినందించి తీరాలి’ అని శోభిత తన ఇన్ స్టాలో స్టోరీ పోస్ట్ చేసింది.

ఇంతకీ శోభితను అంతలా ఆకట్టుకున్న సినిమా ఏదనుకుంటున్నారా? స్టార్ డైరెక్టర్లు ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ సంయుక్తంగా నిర్మించిన ఈ బోల్డ్ అండ్ కాంట్రవర్సీ మూవీ పేరు బ్యాడ్ గర్ల్. వర్ష భరత్ తెరకెక్కించిన ఈ సినిమాలో అంజలి శివరామన్ ప్రధాన పాత్రలో నటించగా, శరణ్య రవిచంద్రన్ మరో కీలక పాత్రలో మెరిసింది. ఈ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని, యువతను పెడదోవ పట్టించేలా ఉన్నాయని వివాదాలు చుట్టుముట్టాయి. చివరకు సెన్సార్ బోర్డు కూడా ఈ సినిమాకు బిగ్ షాక్ ఇచ్చింది. సినిమాలోని అభ్యంతరకరమైన సన్నివేశాలకు కట్ చెప్పింది. ఆ తర్వాతే ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఒక అమ్మాయి ఎందుకు బ్యాడ్ గర్ల్ గా మారిపోయిందన్న కథతో ఈ సినిమాను రూపొందించారు.

ఇవి కూడా చదవండి

తెలుగులోనూ స్ట్రీమింగ్..

థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ది బ్యాడ్ గర్ల్ మూవీ ఇప్పుడు జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.