Tollywood: ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హీరో.. ట్యాలెంట్ టన్నుల్లో.. లక్కేమో నిల్లు
2010లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇప్పటిదాకా ఓ పాతిక సినిమాలు చేశాడు. ఎక్కువగా హీరో పాత్రలే చేశాడు. అప్పుడప్పుడూ విలన్ గానూ అదరగొట్టాను. ఈ హీరోకు యాక్టింగ్ పరంగా టన్నుల కొద్దీ ట్యాలెంట్ ఉంది. కానీ అదృష్టమే కలసి రావడం లేదు.

పై ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తు పట్టారా? అతను ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరో. అప్పుడప్పుడు విలన్ గానూ అదరగొడతాడు. కెరీర్ ప్రారంభంలో విలన్ గా, సహాయక నటుడి పాత్రలతోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆపై హీరోగా మారాడు. ఇప్పటివరకు సుమారు 25 సినిమాల్లో నటించాడు. కానీ హిట్ సినిమాలు మాత్రం వేళ్లపై లెక్కపెట్టవచ్చు. అలాగనీ ఈ నటుడిలో ట్యాలెంట్ కు ఏ మాత్రం కొదవలేదు. పాత్ర కోసం ప్రాణం పెట్టేస్తాడు. సిక్స్ ప్యాక్ చేసి స్లిమ్ గా కనిపిస్తాడు. అవసరమైతే ఒళ్లు చేసి లావుగా కనిపిస్తాడు. ఇలా సినిమా కోసం ప్రాణం పెట్టే ఈ నటుడికి అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ఏ సినిమా చేసినా కమర్షియల్ గా వర్కవుట్ అవ్వడం లేదు. అలాగనీ ఈ హీరో ఆగడం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. అలా తాజాగా మరో డిఫరెంట్ సినిమాతో మన ముందుకొచ్చాడీ ట్యాలెంటెడ్ హీరో. కానీ మళ్లీ నిరాశే ఎదురైంది. తన నటనకు, శ్రమకు ప్రశంసలు దక్కినా సినిమాకు మాత్రం నెగెటివ్ టాక్ వస్తోంది. దీంతో సక్సెస్ కోసం ఈ నటుడు మరికొంత కాలం వేచి చూడాల్సిందే. అన్నట్లు ఈ నటుడు ఒక ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. జాతీయ స్థాయిలో పతకాలు కూడా గెల్చుకున్నాడు. అయితే నటనపై మక్కువతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఈ హీరో మరెవరో కాదు మహేష్ బాబు బావ సుధీర్ బాబు. ఇది అతని చిన్నప్పటి ఫొటో.
సుధీర్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా జటాధర. వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ తెరకెక్కించిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీలో సోనాక్షి సిన్హా మరో కీలక పాత్ర పోషించింది. అలాగే మహేష్ మరదలు శిల్పా శిరోద్కర్ చాలా రోజుల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది. టీజర్స్, ట్రైలర్ తో ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా తీరా థియేటర్లలోకి వచ్చాక నిరాశ కలిగించింది. నవంబర్ 07న ప్రేక్షకుల ముందుకు వచ్చిన జటాధరకు నెగెటివ్ టాక్ వస్తోంది. అయితే కలెక్షన్లు మాత్రం స్టడీగా ఉంటున్నాయి.
జటాధర సినిమాలో సుధీర్ బాబు
Eternally grateful for this opportunity to dance for this divine Shiva Stotram in #Jatadhara 🔱
Bookings open now; see you in theatres from Nov 7th!
Special thanks to @SandeepAata master for this incredible choreography#JatadharaOnNOV7 pic.twitter.com/scQ0b8Yfe8
— Sudheer Babu (@isudheerbabu) November 5, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








