AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Buchibabu Sana: పిఠాపురంలో కొత్తిల్లు కట్టుకున్న’పెద్ది’ డైరెక్టర్.. ఘనంగా గృహ ప్రవేశం.. వీడియో ఇదిగో

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురంలో కొత్త ఇల్లు కట్టుకున్నాడు టాలీవుడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా. శనివారం (నవంబర్ 08) తన కుటుంబ సభ్యులతో కలిసి కొత్తింట్లోకి అడుగు పెట్టాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

Buchibabu Sana: పిఠాపురంలో కొత్తిల్లు కట్టుకున్న'పెద్ది' డైరెక్టర్.. ఘనంగా గృహ ప్రవేశం.. వీడియో ఇదిగో
Peddi Movie Director Buchibabu Sana
Basha Shek
|

Updated on: Nov 09, 2025 | 1:24 PM

Share

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుల్లో బుచ్చిబాబు సనా కూడా ఒకరు. గురువు ఆశీస్సులతోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. మొదటి సినిమాతోనే రూ.100 కోట్ల క్లబ్ లో చేరాడు. అలాగే జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. 69వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉప్పెన సినిమా తెలుగులో ఉత్తమ చిత్రంగా ఎంపికైన సంగతి తెలిసిందే. దీని తర్వాత కొద్దిగా గ్యాప్ తీసుకున్నప్పటికీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు బుచ్చిబాబు. ప్రస్తుతం వీరి కాంబినేషన్ లో ‘పెద్ది’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగులోనే బిజీ బిజీగా ఉంటున్నాడు ట్యాలెంటెడ్ డైరెక్టర్. అయితే ఈ సినిమా కంటే ముందే మరో గుడ్ న్యూస్ చెప్పాడు బుచ్చిబాబు. కాకినాడ జిల్లా ఉప్పాడకు చెందిన అతను తాజాగా పిఠాపురంలో కొత్త ఇల్లు నిర్మించుకున్నారు. శనివారం (నవంబర్ 08)న సతీ సమేతంగా గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, సన్నిహితులు పాల్గొన్నారు. కాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పిఠాపురానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బుచ్చిబాబు ఇప్పుడు అదే పిఠాపురంలో కొత్తిల్లు కట్టుకోవడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు బుచ్చిబాబుకు అభినందనలు, శుభాకాంక్షలు చెబుతున్నారు.

కాగా గృహప్రవేశం కార్యక్రమం వల్లనే గత రాత్రి జరిగిన ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ కాన్సర్ట్‌కు బుచ్చిబాబు రాలేకపోయారు. అయితే ఆయన తెరకెక్కిస్తున్న పెద్ది సినిమా సాంగ్‌ ఈ కార్యక్రమంలో మరోసారి ప్రేక్షకులకు లైవ్‌లో వినిపించారు. ఇక పెద్ది సినిమా విషయానికి వస్తే.. విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు త్రిపాఠి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

గృహప్రవేశంకార్యక్రమంలో బుచ్చిబాబు సనా దంపతులు..

పెద్ది సినిమాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే పెద్ది సినిమా నుంచి విడుదలైన చికిరీ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే