AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ ఓటింగ్‌ ఉల్టా పల్టా.. డేంజర్‌జోన్‌లోకి టాప్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ తొమ్మిదో వారం ఎలిమినేషన్ ఆసక్తికరంగా మారింది. ఓటింగ్ లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. కొందరు టాప్ కంటెస్టెంట్లు ఉన్నట్లుండి డేంజర్ జోన్ లోకి ఎంటర్ అయ్యారు. దీంతో ఈ వారం ఎలిమినేట్ కానున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ ఓటింగ్‌ ఉల్టా పల్టా.. డేంజర్‌జోన్‌లోకి టాప్ కంటెస్టెంట్.. ఎలిమినేట్ ఎవరంటే?
Bigg Boss Telugu 9
Basha Shek
|

Updated on: Nov 07, 2025 | 7:51 AM

Share

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే తొమ్మిదో వారం మధ్యలోకి వచ్చేసింది. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఇప్పటికే 9 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో 14 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం ఎలిమినేషన్ కు సంబంధించి మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. భరణి శంకర్, సాయి శ్రీనివాస్, తనూజ పుట్టస్వామి, కల్యాణ్ పడాల, సుమన్ శెట్టి, రాము రాథోడ్, సంజన గల్రాని 7 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. వీరికి ఆన్ లైన్ ఓటింగ్ పోల్స్ కూడా జరుగుతోంది. ఈ ఓటింగ్ ప్రక్రియ కూడా దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు మాత్రమే ఈ వారం ఓటింగ్ కు సమయం ఉంది. ప్రస్తుతం బిగ్ బాస్ ఓటింగ్ సరళిని పరిశీలిస్తే.. ఎప్పుడూ టాప్ లో నిలిచే తనూజ ఈ వారం సెకెండ్ ప్లేసుకు పడిపోయింది. టాస్కుల్లో సత్తా చాటుతోన్న కల్యాణ్ పడాల ఇప్పుడు టాప్ ప్లేసుల కొనసాగుతున్నాడు.

ఇక మరో టాప్ కంటెస్టెంట్ తనూజ గౌడ రెండో స్థానంలో ఉంది. మూడో ప్లేసులో సీనియర్ హీరోయిన్ సంజన గల్రాని కొనసాగుతోంది. నాలుగో స్థానంలో సీరియల్ నటుడు భరణి శంకర్, హీరో సాయి శ్రీనివాస్ ఐదో ప్లేసులో ఉన్నారు. ఇక మరో టాప్ కంటెస్టెంట్ అయిన సుమన్ శెట్టి ఈ వారం ఓటింగ్ లో అనూహ్యంగా వెనకపడిపోయడు. ప్రస్తుతం అతను ఆరో ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ఇక ఫోక్ సింగర్ రాము రాథోడ్ ఏడో ప్లేసులో ఉన్నాడు. అంటే ప్రస్తుతం సుమన్ శెట్టి, రాము రాథోడ్‌ డేంజర్ జోన్ లో ఉన్నారన్నమాట. ఈ ఇద్దరిలో ఎవరైనా ఒకరు ఈ వారం బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే రాము రాథోడ్ కే ఈ వారం ఎలిమినేషన్ గండం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే సుమన్ శెట్టికి హౌస్ మేట్స్ తో పాటు బయటి నుంచి కూడా గట్టి మద్దతు లభిస్తోంది. కాబట్టి అతను సేవ్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
ఈ ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా.?
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!
పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!