Tollywood: రోజూ 100 పాన్లు తిన్న స్టార్ హీరో.. పాపం నోరంతా పొక్కులు.. ఎవరో తెలుసా?
సినిమాల్లో సహజంగా కనిపించాలని కొందరు హీరోలు సిక్స్ ప్యాక్ లు చేస్తారు. అదే సమయంలో మరికొందరు నటులు బరువు పెరుగుతారు. ఇంకొందరు గుండు కూడా కొట్టించుకుంటారు. అయితే ఈ స్టార్ హీరో సినిమాల్లో సహజత్వం కోసం రోజూ ఏకంగా 100 పాన్లు తిన్నాడట.

కొందరు హీరోలు సినిమాల కోసం ఎంతకైనా తెగిస్తాడు. అవసరమైతే బరువు పెరుగుతారు.. లేదనుకుంటే సిక్స్ ప్యాక్ చేసి స్లిమ్ గా మారుతారు. ఇంకొందరు హీరోలు డూప్స్, బాడీ డబుల్ అవసరం లేకుండా యాక్షన్ సీక్వెన్స్ చేస్తారు. ఇలా సినిమాల కోసం తమ సర్వస్వాన్ని ధారపోసే హీరోలు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరో కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. పాత్ర ఏదైనా ప్రాణం పెట్టి చేయడం ఈ హీరో స్పెషాలిటీ. అందుకే అతను సినిమాల్లో సూపర్ స్టార్ గా ఎదిగాడు. దేశం గర్వించదగ్గ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అలాంటి స్టార్ హీరో తన సినిమాలో సహజంగా కనిపించడానికి రోజూ 100 పాన్లు తిన్నాడు. చాలా మంది నమ్మకపోయినా ఇదే నిజం. హీరోనే స్వయంగా ఈ విషయాన్ని అందరితో పంచుకున్నాడు. ఆయన మరెవరో కాదు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్.
2014లో ఆమిర్ ఖాన్ నటించిన చిత్రం ‘పీకే’. రాజ్‌కుమార్ హిరాణీ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ఇందులో ఆమిర్ ఖాన్ ఓ గ్రహాంతరవాసిగా నటించాడు. అయితే ఈ సినిమాలో సహజంగా కనిపించాలని తపించిన ఈ స్టార్ హీరో పాన్ నమలడం అలవాటు చేసుకున్నాడు. అలా రోజుకు 100 పాన్ లు తిన్నాడట. ‘పెదవులు సహజంగా ఎర్రగా కనిపించాలంటే నిజమైన పాన్ నమలడం తప్పదని అనిపించింది. అందుకే సెట్‌లో ఒక ప్రత్యేక పాన్‌వాలాను ఏర్పాటు చేసుకున్నాం. అతనే నాకు రోజంతా పాన్లు చుట్టి ఇచ్చాడు. కానీ రోజంతా పాన్ తినడం వల్ల నాకు నోట్లో పొక్కులు వచ్చాయి. అయినా షూటింగ్ పూర్తయ్యే వరకు పాన్లు తినడం ఆపలేదు. ఆ పాత్ర కోసం చాలా బాధను భరించాను’ అని ఆమిర్ ఖాన్ చెప్పుకొచ్చాడు.
Call it fate, call it perfect casting, either way, Sakshi Tanwar was meant to play Daya Kaur. ✨
[Aamir Khan, Sakshi Tanwar, Mahavir Phogat, Daya Kaur, Bollywood, Bollywood movies, Dangal, AKP Castings] pic.twitter.com/9JBnWq83Fd
— Aamir Khan Productions (@AKPPL_Official) November 3, 2025
ప్రస్తుతం ఈ స్టార్ హీరో కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. సినిమాల పట్ల అతని నిబద్ధత, కమిట్మెంట్ ను చూసి అందరూ ప్రశంసిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








