OTT Movies: ఫ్రైడే ఎంటర్ టైన్మెంట్.. శుక్రవారం ఒక్కరోజే ఓటీటీలో 15కు పైగా కొత్త సినిమాలు.. స్ట్రీమింగ్ లిస్ట్ ఇదిగో
గతవారంతో పోల్చుకుంటే ఈ వారం థియేటర్లలో కొన్ని ఆసక్తికరమైన సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. మరి ఈ శుక్రవారం (నవంబర్ 07) ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు రానున్నాయో చూద్దాం రండి.

శుక్రవారం రాగానే కొత్త సినిమాల సందడి మొదలవుతుంది. అటు థియేటర్లలోనూ, ఇటు ఓటీటీలోనూ ఏయే సినిమాలు వస్తున్నాయో తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తాం. అలా ఈ వారం థియేటర్లలో కొన్ని ఆసక్తికరమైన సినిమాలు రిలీజ్ కానున్నాయి. సుధీర్ బాబు జఠాధర, రష్మిక మందన్నా ది గర్ల్‌ఫ్రెండ్, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో, ప్రేమిస్తున్నా లాంటి చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. వీటితో పాటు ఆర్యన్, ఫీనిక్స్ లాంటి డబ్బింగ్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటిలో జఠాధర, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలు కొంచెం ఆసక్తికని కలిగిస్తున్నాయి. ఇక ఓటీటీల విషయానికి వస్తే.. ఇప్పటికే చాలా సినిమాలు, సిరీస్ లు పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. రాజ్ తరుణ్ నటించిన చిరంజీవ సినిమా ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే హిందీలో మహారాణి వెబ్ సిరీస్ సీజన్ 4 కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. వీటితో పాటు హిందీ, ఇంగ్లిష్, కన్నడ, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఈ శుక్రవారం (నవంబర్ 07) ఏయే ఓటీటీల్లో ఏయే సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయో ఒక లుక్కేద్దాం రండి.
నెట్‌ఫ్లిక్స్
- ఏక్ చతుర్ నార్(హిందీ సినిమా) – నవంబరు 07
- బారాముల్లా (ఇంగ్లిష్ సినిమా) – నవంబరు 07
- ఫ్రాంకెన్ స్టెయిన్ (ఇంగ్లిష్ మూవీ) – నవంబరు 07
- మ్యాంగో(హాలీవుడ్ సినిమా)- నవంబరు 07
- యాజ్ యూ స్టూడ్ బై-(కొరియన్ థ్రిల్లర్ సినిమా)- నవంబరు 07
- గ్రూమ్ అండ్ టూ బ్రైడ్స్(హాలీవుడ్ సినిమా)- నవంబరు 07
జియో హాట్‌స్టార్
- ఆల్ హర్ ఫాల్ట్- (హాలీవుడ్ సినిమా)- నవంబరు 07
- అమెజాన్ ప్రైమ్ వీడియో
- మ్యాక్స్‌టన్ హాల్ (జర్మన్ వెబ్ సిరీస్) – నవంబరు 07
- ఆహా
- చిరంజీవ (తెలుగు చిత్రం) – నవంబరు 07
జీ5
- కిస్ (తమిళ సినిమా) – నవంబరు 07
- తోడే దూర్ తోడే పాస్ (హిందీ వెబ్ సిరీస్) – నవంబరు 07
సోనీ లివ్
- మహారాణి సీజన్ 4 (హిందీ వెబ్ సిరీస్) – నవంబరు 07
ఆపిల్ ప్లస్ టీవీ
- ప్లరిబస్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) – నవంబరు 07
మనోరమ మ్యాక్స్
- కరమ్ (మలయాళ సినిమా) – నవంబరు 07
లయన్స్ గేట్ ప్లే
- అర్జున్ చక్రవర్తి (తెలుగు సినిమా) – నవంబరు 07
- ద హ్యాక్ సీజన్- 1 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – నవంబరు 07
సన్ నెక్ట్స్
- ఎక్కా(కన్నడ సినిమా)- నవంబరు 07
Note: ఇవి కాక వారం కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








