AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్‌కు లవర్‌గా, బాలయ్యకు తల్లిగా నటించిన ఏకైక టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా? 40 ప్లస్‌లోనూ తగ్గని క్రేజ్

ప్రభాస్, బాలకృష్ణ.. వేర్వేరు తరాలకు చెందిన హీరోలైనా ఇద్దరికీ కోట్లాది మంది అభిమానులున్నారు. ఇప్పుడు ఈ హీరోలు బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల సినిమాలు కొడుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్ షూటింగులో ఉండగా, త్వరలోనే అఖండ 2 సినిమాతో మన ముందుకు రానున్నాడు బాలయ్య.

ప్రభాస్‌కు లవర్‌గా, బాలయ్యకు తల్లిగా నటించిన ఏకైక టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా? 40 ప్లస్‌లోనూ తగ్గని క్రేజ్
Prabhas, Balakrishna
Basha Shek
|

Updated on: Nov 05, 2025 | 9:58 PM

Share

సినిమా ఇండస్ట్రీలో కొన్ని సార్లు విచిత్రమైన కాంబినేషన్లు సెట్ అవుతుంటాయి. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల జోడీ విషయంలో తరచుగా ఇలా జరుగుతుంటుంది. ఒక సినిమాలో హీరోతో కలిసి ఆడిపాడిన హీరోయిన్ మరో సినిమాలో అదే హీరోకు చెల్లెలిగా, అక్కగా లేదా మరో పాత్రలో కనిపించవచ్చు. అలాగే ఒక హీరోకు లవర్‌గా, భార్యగా నటించిన హీరోయిన్.. మరో సినిమాలో మరో హీరోకు అక్కగానో, అమ్మగానో నటిస్తుంది. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయమేమీ లేదు కానీ సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని కాంబినేషన్లు చిత్ర విచిత్రంగా ఉంటాయి ఉదాహరణకు ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న హీరోయిన్ ఒక సినిమాలో ప్రభాస్ తో రొమాన్స్ చేసింది. కానీ మరో సినిమాలో ప్రభాస్ కంటే వయసులో పెద్ద వాడైన హీరోకు తల్లిగా నటించింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార.

ప్రభాస్‌తో కలిసి యోగి సినిమాలో నటించింది నయనతార. వినాయక్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ పెద్దగా ఆడలేదు. కానీ ప్రభాస్- నయన తార జోడీకి మంచి మార్కులే పడ్డాయి. ఇక బాలయ్యతో కలిసి సింహా సినిమాలో నటించింది నయనతార. ఇందులో బాలయ్య డ్యూయెల్ రోల్‌లో నటించాడు. ఇందులో ప్లాష్ బ్యాక్ లో వచ్చే బాలకృష్ణకు భార్యగా నటించింది. అలాగే కొడుకు బాలకృష్ణకు తల్లిగా నటించింది. అలా ఈ లేడీ సూపర్ స్టర్ బాలయ్యకు తల్లిగా, ప్రభాస్‌కు జోడీగా నటించింది.

ఇవి కూడా చదవండి

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నయన తార..

కాగా సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు కెరీర్ కొనసాగిస్తోన్న హీరోయిన్లలో నయన తార ఒకరు. 40 ప్లస్ లోనూ అదే అందం, అదే క్రేజ్ తో లేడీ సూపర్ స్టార్ గా వెలుగొందుతోందీ అందాల తార. ప్రస్తుతం చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలో నటిస్తోంది నయన తార. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా భాగం పూర్తయ్యింద. మీసాల పిల్ల సాంగ్ కూడా చార్ట్ బస్టర్ గా నిలిచింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మెగా మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.  దీంతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వార్నీ.. 1982 నాటి కేసులో ఇప్పుడు తీర్పు.. 100 ఏళ్ల వృద్ధుడికి..
వార్నీ.. 1982 నాటి కేసులో ఇప్పుడు తీర్పు.. 100 ఏళ్ల వృద్ధుడికి..
ఎమ్మెల్యే శ్రీధర్‌తో కారులో లాంగ్ డ్రైవ్.. మరో వీడియో వదిలిన వీణ.
ఎమ్మెల్యే శ్రీధర్‌తో కారులో లాంగ్ డ్రైవ్.. మరో వీడియో వదిలిన వీణ.
ఈ రాశుల వారికీ బ్యాడ్ టైమ్ స్టార్ట్.. జాగ్రత్తగా ఉండండి!
ఈ రాశుల వారికీ బ్యాడ్ టైమ్ స్టార్ట్.. జాగ్రత్తగా ఉండండి!
రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ బిగ్ అప్డేట్..
రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ బిగ్ అప్డేట్..
మీరు హారతి ఇచ్చే కర్పూరం అసలైనదా..? నకిలీదా..? సింపుల్‌గా..
మీరు హారతి ఇచ్చే కర్పూరం అసలైనదా..? నకిలీదా..? సింపుల్‌గా..
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన యువకుడు.. స్కాన్‌ చేయగా,
తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన యువకుడు.. స్కాన్‌ చేయగా,
నోరు జారాడు.. క్షమించండి.. చంద్రహాస్ బూతు పాటపై నిర్మాతలు
నోరు జారాడు.. క్షమించండి.. చంద్రహాస్ బూతు పాటపై నిర్మాతలు
అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ హ్యాబిట్స్ ఎలా ఉండేవంటే.?
అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ హ్యాబిట్స్ ఎలా ఉండేవంటే.?
కలబంద మొక్కను మీ ఇంట్లో ఆ మూలాన పెట్టారనుకోండి..
కలబంద మొక్కను మీ ఇంట్లో ఆ మూలాన పెట్టారనుకోండి..
వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం.. పిండం గుండెకు చికిత్స…హైదరాబాద్‌పై
వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం.. పిండం గుండెకు చికిత్స…హైదరాబాద్‌పై