తండ్రి తోపు హీరో.. కూతురు మాత్రం మూడు సినిమాలకే కనిపించకుండా పోయింది.. ఆమె ఎవరంటే
హీరోయిన్స్ గా సినిమాల్లో రాణించడం అంత సులభం కాదు.. అందం , అభినయంతో పాటు అదృష్టం కూడా ఉండాలి. కొంతమంది వరుస సినిమాలతో దూసుకుపోతుంటే మరికొంతమంది మాత్రం సినిమా ఆఫర్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఓ స్టార్ కిడ్ మాత్రం కేవలం మూడు సినిమాలకే కనిపించకుండాపోయింది.

సినిమా ఇండస్ట్రీలో వారసులు ఎంతో మంది వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నారు. కొంతమంది స్టార్స్ గా రాణిస్తుంటే మరి కొంతమంది కొన్ని సినిమాలకే కనిపించకుండా మాయం అవుతున్నారు .. ఎంత సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా టాలెంట్ లేకపోతే ఇండస్ట్రీలో నెట్టుకురావడం కష్టమే.. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కొత్త హీరోలు. కొత్త కొత్త దర్శకులు సత్తా చాటుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కాగా హీరోయిన్స్ విషయంలో మాత్రం పరిస్థితులు ఇప్పటికప్పుడు తారుమారు అవుతుంటాయి. కొంతమంది స్టార్ డమ్ తెచ్చుకున్నాక కనిపించకుండా పోతారు. మరికొంతమంది ఓవర్ నైట్ లో స్టార్స్ అవుతుంటారు. ఇంకొంతమంది హిట్స్ లేకున్నా వరుసగా సినిమా ఆఫర్స్ అందుకుంటున్నారు. అయితే ఓ స్టార్ హీరో కూతురు మాత్రం కేవలం మూడు సినిమాలకే సర్దేసుకుంది. ఆమె తండ్రి ఇండస్ట్రీలో తోప్ హీరో.. విలన్ గాను అదరగొట్టాడు. కానీ ఆయన కూతురు మాత్రం సినీ సాగరంలో ఈదలేకపోయింది. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరంటే..
బాలీవుడ్ లో స్టార్ హీరో ఒకానొక సమయంలో ఊపేశాడు సునీల్ శెట్టి. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ లో నటించి సత్తా చాటాడు. కేవలం హీరోగానే కాదు విలన్ గాను ప్రేక్షకులను భయపెట్టాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన దర్బార్ సినిమాలో సునీల్ శెట్టి విలన్ పాత్ర పోషించాడు. ఇక ఆయన గారాల కూతురు అతియా శెట్టి కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. హీరోయిన్ గా అడుగు పెట్టిన ఆమె అంతగా సక్సెస్ కాలేదు. చేసింది మూడు సినిమాలే అయినా ఆ మూడు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దాంతో కనిపించకుండా మాయం అయ్యింది.
2015లో వచ్చిన హీరో అనే సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టింది అతియా శెట్టి. ఈ సినిమాకు సల్మాన్ ఖాన్ నిర్మాతగా వ్యవహరించగా.. మరో సినీ వారసుడు సూరజ్ పంచోలి హీరోగా నటించాడు. భారీ అంచనాలు, భారీ బడ్జెట్, భారీ ప్రమోషన్స్ మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. సినిమా డిజాస్టర్ అయ్యింది. అతియా స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నా.. సినిమా పెద్దగా ఎక్కలేదు. ఆతర్వాత 2017లో ‘ముబారకన్ అనే సినిమా చేసింది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. కానీ ఆమె కెరీర్ కు ఈ సినిమా ఏం ఉపయోగపడలేదు. 2019లో వచ్చిన ‘మోతీచూర్ చక్నాచూర్ అనే సినిమా చేసింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు అతియా శెట్టి. స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ పెళ్ళాడి ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి




