AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 9 Telugu : అడ్డంగా దొరికిపోయిన తనూజ.. ఇమ్మూ ముందు తలూపి.. నాగార్జున ముందు ఇరికించింది..

బిగ్‌బాస్ సీజన్ 9.. ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్ షిప్ టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సీక్రెట్ టాస్కులో భాగంగా సుమన్ శెట్టి, దివ్యలను రెబల్స్ గా సెలక్ట్ చేసిన బిగ్‌బాస్ .. వారిద్దరి సీక్రెట్ టాస్కులు ఇవ్వగా.. సుమన్ శెట్టి సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశాడు. ఇదిలా ఉంటే.. తాజాగా తనూజ గురించి ఓ వీడియో నెట్టింట వైరలవుతుంది.

Bigg Boss 9 Telugu : అడ్డంగా దొరికిపోయిన తనూజ.. ఇమ్మూ ముందు తలూపి.. నాగార్జున ముందు ఇరికించింది..
Bigg Boss 9 Telugui Thanuja
Rajitha Chanti
|

Updated on: Nov 05, 2025 | 2:34 PM

Share

బిగ్‌బాస్ సీజన్ 9 మొదలైనప్పటి నుంచి ఎలాంటి నెగిటివిటీ లేకుండా ఫాలోయింగ్ పెంచుకున్న కంటెస్టెంట్ తనూజ. మొదట్లో హౌస్ లో నాన్న, అత్త, తమ్ముడు అంటూ బాండింగ్స్ చుట్టూ తిరిగిన తనూజ.. ఈమధ్య ఒంటరైంది. ముఖ్యంగా మొదటి రోజు నుంచి స్నేహితులుగా ఉన్న ఇమ్మూ, తనూజ ఇప్పుడు శత్రువులుగా మారారు. గత వారం తనూజతో హౌస్మేట్స్ అందరితో గొడవలు జరిగాయి. ఆమె రేషన్ మేనేజర్ అయ్యాక.. ప్రతి ఒక్కరితో ఆమెకు గొడవ జరిగింది. సంజన, మాధురి, కళ్యాణ్, గౌరవ్, సాయి ఇలా దాదాపు అందరితోనూ గొడవ పడింది తనూజ. అయితే వీటి గురించి మొన్నటి శనివారం ఎపిసోడ్ లో ప్రశ్నించారు నాగ్.

ప్రతి రోజూ గొడవ జరుగుతూనే ఉంది ఏంటీ తనూజ అని నాగ్ అడగ్గా.. అందుకు కారణం ఇమ్మాన్యూయేల్ అంటూ తెలివిగా ఆన్సర్ ఇచ్చింది. నాకు కిచెన్ డిపార్ట్మెంట్ వద్దని.. నేను అక్కడికి వెళ్తే కావాలని నన్ను టార్గెట్ చేస్తారు సార్ కొంతమంది .. అందుకే ముందే నేను కిచెన్ డిపార్ట్మెంట్ వద్దని ఇమ్మాన్యుయేల్ కు చెప్పాను అని నాగార్జున ముందు చెప్పింది. దీంతో వద్దన్నా తనకే ఎందుకు ఆ డ్యూటీ వేశావ్ అని నాగార్జున ఇమ్మూని అడ్గగా.. నాకు వద్దని ఏం చెప్పలేదు సార్ అని ఇమ్మూ ఆన్సర్ ఇచ్చారు. నేను చెప్పానుగా అన్నట్లుగా ఫేస్ పెట్టింది తనూజ. ఆ తర్వాత నువ్వు ఇమ్మాన్యుయేల్ చెప్పావా అని అడిగితే చెప్పాను అని మరోసారి చెప్పింది.

అయితే ఇప్పుడు తనూజ అబద్ధం చెప్పిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ఏకీపారేస్తున్నారు. వీడియో చూపించి మరీ తనూజ మిస్టేక్స్ చూపిస్తున్నారు. చెప్పాను అంటూ తనూజ అబద్దం చెప్పినప్పటికీ వీడియో ప్లే చేయకుండా నాగార్జున సైలెంట్ గా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం తనూజ వీడియోను నెట్టింట షేర్ చేస్తున్నారు. అందులో మాధురి, తనూజ, ఇమ్మూ మాట్లాడుకోవడం కనిపిస్తుంది.

రేషన్ మేనేజర్ గా తనకు ఛాన్స్ ఇవ్వు.. చేయలేకపోతే అప్పుడు దివ్యకు ఇద్దాం అని మాధురి ఇమ్మూతో చెప్పింది. దీంతో ఏమంటావ్ చేస్తావా.. అని ఇమ్మాన్యుయేల్ తనూజకు అడిగితే చేస్తాను అంటూ తలూపింది తనూజ. ఇ్వు ఇమ్మూ నా వల్ల పోయింది.. అందుకే నేను అడుగుతున్నాను తనకు ఛాన్స్ ఇవ్వు అని మాధురి మళ్లీ అడిగింది. దీంతో మరోసారి అడగ్గా.. మళ్లీ చేస్తానని తలూపింది. దీంతో ఆమెను రేషన్ మేనేజర్ గా చేశాడు. కానీ నాగార్జున ముందు మాత్రం నాకు వద్దు అన్నాను.. అయినా ఇచ్చాడు అంటూ నాగార్జున ముందు అమాయకంగా చెప్పేసింది తనూజత. దీంతో ఇప్పుడు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..