AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఒకప్పటి టాలీవుడ్‌ను ఏలేసిన స్టార్ హీరోయిన్‌.. ఇప్పుడిలా మారిపోయిందేంటి! ఎవరో గుర్తు పట్టారా?

80-90'sలో తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిందీ అందాల తార. శ్రీదేవి, విజయశాంతి, జయసుధ, జయప్రద వంటి స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీనిచ్చింది. తెలుగుతో పాటు అన్ని భాషల్లో కలిపి దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించిన ఈ అందాల తార ఇప్పుడు విదేశాల్లో సెటిలైపోయింది.

Tollywood: ఒకప్పటి టాలీవుడ్‌ను ఏలేసిన స్టార్ హీరోయిన్‌.. ఇప్పుడిలా మారిపోయిందేంటి! ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Nov 06, 2025 | 9:29 PM

Share

హీరోలతో పోల్చుకుంటే సినిమాల్లో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. వరుసగా 2,3 సినిమాలు ఫ్లాఫ్ అయితే చాలు ఫేడవుట్ అయిపోతారు. అలాగే పెళ్లి, పిల్లల తర్వాత కూడా చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి దూరమైపోతుంటారు. అయితే ఇలా దూరమైన వాళ్లలో చాలా మంది ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్నారు. సహాయక నటులుగా సెకెండ్ ఇన్నింగ్స్ షురూ చేస్తున్నారు. ఇంకొందరు వ్యాపారాలు చేసుకుంటూ బిజీ బిజీగా ఉంటున్నారు. ఈ టాలీవుడ్ నట కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిందీ అందాల తార. తన నటనతో అందర్నీ మెప్పించింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అప్పట్లో ఈ జోడీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. చిరంజీవితో పాటు కృష్ణ, శోభన్ బాబు, రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్‌ హీరోలతో జతకట్టింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం, ఒరియా భాషల్లో దాదాపు 300కి పైగా చిత్రాల్లో నటించిన ఈ అందాల తార కెరీర్ పీక్స్ ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంది. సడెన్ గా సినిమాలకు గుడ్ బై చెప్పింది.

సినిమాలకు దూరమైనా ఈ టాలీవుడ్ నటి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన ఫ్యామిలీ ఫొటోలను తరచూ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తోంది. అలా ఈ అమ్మడు షేర్ చేసిన కొన్ని ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. పై ఫొటో అదే. మరె ఆమె ఎవరో గుర్తు పట్టారా? మాతృదేవోభవ సినిమాలో తన నటనతో కన్నీళ్లు పెట్టించిన మాధవి లేటెస్ట్ ఫొటోనే అది.

మాధవి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ఖైదీ, బిగ్ బాస్, మరోచరిత్ర, కోతల రాయుడు, మండే గుండెలు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఇలా చాలా సినిమాలు మాధవికి మంచి గుర్తింపు తీసుకచ్చాయి. తెలుగులోనే కాక తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో కూడా చాలా సినిమాలు చేసిందీ అందాల తార. కాగా సినిమాల్లో ఉండగానే మాధవి 1996లో రాల్ఫ్ శర్మ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అమెరికా వెళ్లిపోయి అక్కడే స్థిరపడింది. ఆ తర్వాత నుంచి మళ్లీ సినిమాలు చేయలేదు. ప్రస్తుతం మాధవికి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. వ్యాపారాల్లో బిజీగా ఉండే ఆమె అప్పుడప్పుడు సోషల్ మీడియాలో తన ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తోంది. అలా తాజాగా ఆమె తన ఫ్యామిలీతో దిగిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒకప్పటి స్టార్ హీరోయిన్ చాలా మారిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి
Madhavi Family

Madhavi Family

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సోనీ నుంచి సరికొత్త ఫీచర్లతో థియేటర్ ఉత్పత్తులు
సోనీ నుంచి సరికొత్త ఫీచర్లతో థియేటర్ ఉత్పత్తులు
మగాళ్లలో ఆ శక్తి తగ్గడానికి కారణం ఇదేనా..? ఇవి మార్చుకోకపోతే..
మగాళ్లలో ఆ శక్తి తగ్గడానికి కారణం ఇదేనా..? ఇవి మార్చుకోకపోతే..
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. ఇక సెమీస్ చేరాలంటే ఇలా జరగాల్సిందే
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. ఇక సెమీస్ చేరాలంటే ఇలా జరగాల్సిందే
ఇంట్లో సాలీడుల బెడద ఎక్కువా? ఈ ఒక్క సహజ సువాసనతో వాటిని దూరంగా..
ఇంట్లో సాలీడుల బెడద ఎక్కువా? ఈ ఒక్క సహజ సువాసనతో వాటిని దూరంగా..
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే ఈ పని అస్సలు చేయకండి..
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే ఈ పని అస్సలు చేయకండి..
లైట్స్ ఆన్.. కెమెరా, యాక్షన్.. రాజధాని పిలుస్తోంది రా.. కదలిరా!
లైట్స్ ఆన్.. కెమెరా, యాక్షన్.. రాజధాని పిలుస్తోంది రా.. కదలిరా!
ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు గాల్లోకే..!
ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు గాల్లోకే..!
శుక్రవారం లక్ష్మీదేవి కటాక్షం కోసం ఇవి తప్పక చేయండి.. కానీ..
శుక్రవారం లక్ష్మీదేవి కటాక్షం కోసం ఇవి తప్పక చేయండి.. కానీ..
విదేశాలకు వెళ్లేవారికి షాక్.. భారీగా పెరిగిన పాస్‌పోర్ట్ ఫీజులు..
విదేశాలకు వెళ్లేవారికి షాక్.. భారీగా పెరిగిన పాస్‌పోర్ట్ ఫీజులు..
ఆ స్పెషల్ రికార్డును బద్దలు కొట్టిన శ్రీ చరణి..!
ఆ స్పెషల్ రికార్డును బద్దలు కొట్టిన శ్రీ చరణి..!