AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?.. ఇజ్రాయెల్ వాడిన ‘బ్లూ స్పారో’ మిసైల్ రహస్యాలివే!

అమెరికా- ఇజ్రాయెల్ చేపట్టిన ఎయిర్‌ స్ట్రైక్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ అలి ఖమేనీ మరణం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాశంగా మారింది. అయితే ఆయన మరణానికి కారణమైన దాడిలో బ్లూ స్పారో క్షిపణి ఉపయోగించారని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. అధునాతన ఆయుధ వ్యవస్థలతో ఇజ్రాయెల్ నిర్వహించిన ఈ ఆపరేషన్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది.

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?.. ఇజ్రాయెల్ వాడిన 'బ్లూ స్పారో' మిసైల్ రహస్యాలివే!
Iran's Khamenei Killed Blue Sparrow Missile
Prabhakar M
| Edited By: |

Updated on: Mar 07, 2026 | 10:09 AM

Share

ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి జరిగిన రోజున ఉదయం ఇజ్రాయెల్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-15 ఈగిల్ ఫైటర్ జెట్లు టేకాఫ్ తీసుకున్నట్లు సమాచారం. అనంతరం టెహ్రాన్ కేంద్ర ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. సుమారు ఉదయం 9.40 గంటల సమయంలో మొదటి క్షిపణి ప్రయోగం జరిగిందని కథనాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఖమేనీ ఉన్న ప్రాంగణాన్ని లక్ష్యంగా చేసుకుని పలు కచ్చితమైన దాడులు జరిపినట్లు సమాచారం.

దాడి జరిగిన కొద్దిసేపటికే టెహ్రాన్‌లోని ఖమేనీ నివాసం పరిసర ప్రాంతాల్లో భారీ పేలుళ్లు, పొగలు కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ప్రాంతంలోని కొన్ని భవనాలు కూడా దెబ్బతిన్నట్లు రిపోర్టులు వెల్లడించాయి.ఈ ఆపరేషన్ విజయానికి ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొస్సాద్, అలాగే సైబర్ ఇంటెలిజెన్స్ యూనిట్ల సమాచార సేకరణ కీలకంగా పనిచేసినట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. ఖమేనీ సమావేశం జరుగుతున్న సమయాన్ని కచ్చితంగా గుర్తించిన తర్వాతే దాడి చేసినట్లు చెబుతున్నారు.

బ్లూ స్పారో క్షిపణి ప్రత్యేకతలు

బ్లూ స్పారోను అత్యాధునిక క్వాజి బాలిస్టిక్ క్షిపణిగా పరిగణిస్తారు. దాదాపు 1240 మైళ్ల దూరం వరకు ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉందని సమాచారం. గగనతల రక్షణ వ్యవస్థలను తప్పించుకునేలా మధ్యలో తన మార్గాన్ని మార్చుకునే సాంకేతికత దీనిలో ఉంటుంది. ఈ క్షిపణి ప్రయోగించిన తర్వాత ముందుగా చాలా ఎత్తుకు ఎగసి, అక్కడి నుంచి నిటారుగా లక్ష్యంపై అత్యంత వేగంతో దాడి చేస్తుంది. ఈ విధమైన ప్రయాణ విధానం వల్ల దీన్ని ముందుగానే గుర్తించడం రక్షణ వ్యవస్థలకు కష్టం. ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన స్పారో క్షిపణి కుటుంబంలో బ్లాక్ స్పారో, సిల్వర్ స్పారోతో పాటు బ్లూ స్పారో కూడా ఒకటి. సుమారు 6.5 మీటర్ల పొడవు, 1.9 టన్నుల బరువు ఉన్న ఈ క్షిపణిని ఎఫ్-15 వంటి ఫైటర్ జెట్ల నుంచి ప్రయోగించవచ్చు.

ఖమేనీపై దాడి ముందుగానే ప్రణాళిక?

ఇరాన్ సుప్రీం లీడర్‌పై దాడి ఆలోచన 2025 నవంబర్ నుంచే రూపుదిద్దుకుందని కొన్ని అంతర్జాతీయ రిపోర్టులు చెబుతున్నాయి. సరైన సమయం కోసం వేచి చూసిన తర్వాత పరిస్థితులు అనుకూలంగా మారడంతో ఆపరేషన్ అమలు చేశారని పేర్కొంటున్నాయి. ఇరాన్‌లో అంతర్గత అస్థిరత పెరిగిన సమయంలో ఈ ఆపరేషన్‌ను ముందుకు తీసుకువచ్చారని విశ్లేషణలు సూచిస్తున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడమే ఈ వ్యూహం వెనుక ప్రధాన లక్ష్యమని భద్రతా వర్గాలు చెబుతున్నాయి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఎలా చంపారో తెలుసా?
కొండముచ్చుకు గుండెపోటు.. నిమిషాల్లోనే అద్భుతం..
కొండముచ్చుకు గుండెపోటు.. నిమిషాల్లోనే అద్భుతం..
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, సిరీస్‌లివే
వీకెండ్ స్పెషల్.. ఓటీటీలోకి వచ్చేసిన కొత్త సినిమాలు, సిరీస్‌లివే
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత
ఓరీ దేవుడో.. వార్‌ ఎఫెక్ట్‌తో మండిపోతున్న ఆయిల్ ధరలు..2023 తర్వాత
ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే
ఈ ఉగాది నుంచి వారికి బ్యాడ్ టైమ్ స్టార్ట్.. ఏది పట్టుకున్నా ఆగమే
రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి.. కారణం ఇదేనట..
రష్యా చమురు కొనుగోలుకు భారత్‌కు అమెరికా అనుమతి.. కారణం ఇదేనట..
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
నేలపై కూర్చొని తింటేనే ముద్దు అంటున్న నిపుణులు.. ఎందుకంటే?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
IND vs NZ:ఫైనల్‌కు అంపైర్లు వీరే.. మరో ట్రోఫీ ముద్దాడడం ఫిక్స్..?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
వామ్మో ఎండలు.. రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే?
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. రూ.441 కోట్ల ఆస్తుల అటాచ్