AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

High Court : అబ్బా ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఇకపై అక్కడ పార్కింగ్‌ ఫీజు చెల్లించే పనిలేదు!

రాష్ట్రంలోని మూవీ లవర్స్‌కు తెలంగాణ హైకోర్టు అదిరిపోయే గుడ్‌ న్యూస్ చెప్పింది. తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలుకు అనుమతినిస్తూ గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవో 121 ని తెలంగాణ హైకోర్టు కొట్టి చేస్తూ సంచలన తీర్పునిచ్చింది.దీంతో థియేటర్లకు వెళ్లి సినిమా చూసే మూవీ లవర్స్ కోర్టు తీర్పపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

High Court : అబ్బా ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఇకపై అక్కడ పార్కింగ్‌ ఫీజు చెల్లించే పనిలేదు!
Elangana Single Screen Theaters Must Offer Free Parking
Anand T
|

Updated on: Mar 07, 2026 | 10:47 AM

Share

తెలంగాణలోని సినిమా ప్రియులకు హైకోర్టు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇకపై థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలనుకునే వారు పార్కింగ్ ఫీజు చెల్లించాల్సి అవసరం లేదంటూ కీలక ఆదేశాలు జారీ చేసింది. తాజాగా జరిగిన విచారణ సందర్భంగా గతంలో జారీ చేసిన జీవో నెంబర్ 121ను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తాజా నిర్ణయంతో సినిమా కోసం టికెట్ కొనుగులు చేసిన ప్రేక్షకుడి నుంచి పార్కింగ్ ఫీజు తీసుకునే అవకాశాన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లు యాజమాన్యాలు కోల్పోయాయి.

అయితే సాధారణంగా మనం ఏదైనా మాల్స్, మల్టీప్లెక్స్‌లకు వెళ్లినప్పుడు అక్కడ ఏదైనా షాపింగ్ చేస్తే వారికి ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది. అయితే 2021లో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఈ నిబంధన నుంచి ప్రభుత్వం ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది.దీంతో అక్కడ సినిమాకు వెళ్లే ప్రేక్షకులు ప్రత్యేక పార్కింగ్ చార్జీలు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఓ కేసు విషయంలో జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు మల్టీప్లెక్స్‌ల తరహాలోనే సింగిల్ స్క్రీన్ థియేటర్ల కూడా ఉచిత పార్కింగ్ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసు సందర్భంగా కోర్టు తీర్పు

ఇటీవల దిల్‍సుఖ్‍నగర్‍లోని కోణార్క్ థియేటర్‌లో ఓ ప్రేక్షకుడి నుంచి 20 రూపాయల పార్కింగ్ ఫీజు వసూలు చేయడంపై ప్రేమ్ రామావత్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సైరన కారణాలు లేకుండా సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపును తప్పుపట్టింది. ఈ నేపథ్యంలోనే చెల్లుబాటు అయ్యే సినిమా టికెట్ ఉన్న ప్రేక్షకుడి నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యం ఎటువంటి పార్కింగ్ రుసుము వసూలు చేయకూడదని పేర్కొంది.

అయితే ఈ కేసు విచారణ సంరద్భంగా కోర్టు ఇచ్చిన తీర్పు కేవలం కోణార్క్ థియేటర్‌కు మాత్రమే పరిమితం కాదని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లకు వస్తుందని తెలిపింది. కోర్టు తాజా ఆదేశాలతో ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లు కూడా మల్టీప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్ నిబంధనల పరిధిలోకి వచ్చాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us