AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీనియర్ సిటిజన్లకు కేంద్రం అద్బుత స్కీమ్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే డబ్బులే డబ్బులు..

సీనియర్ సిటిజన్లు తమ పదవీ విరమణ కోసం డబ్బులు పొదుపు చేసుకోవాలని అనుకుంటుంటారు. అలాంటివారి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక పొదుపు పథకం తీసుకొచ్చింది. అదే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్. ఈ పథకం కింద ఎలా పెట్టుబడి పెట్టాలనేది చూద్దాం.

సీనియర్ సిటిజన్లకు కేంద్రం అద్బుత స్కీమ్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే డబ్బులే డబ్బులు..
Senior Citizens Savings Sch
Venkatrao Lella
|

Updated on: Nov 01, 2026 | 7:43 AM

Share

సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే పథకాన్ని అమలు చేస్తోంది. రిటైర్మెంట్ చేసిన వయో వృద్దులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఒక అద్బుతమైన పొదుపు పథకం అందుబాటులోకి తెచ్చింది. అదే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్(SCSS). కేవలం సీనియర్ సిటిజన్లు మాత్రమే ఇందులో పెట్టుబడానికి అర్హత లభిస్తుంది. ఇందులో డబ్బులు పొదుపు చేసుకుంటే స్థిరమైన ఆదాయం లభిస్తుంది. సాధారణంగా 60 ఏళ్లు దాటితే సీనియర్ సిటిజన్లుగా భావిస్తారు. కేంద్ర ప్రభుత్వ మద్దుతుతో నడిచే SCSS స్కీములో పెట్టుబడి పెట్టాలంటే 60 ఏళ్ల వయస్సు ఉండాలని చాలామంది అనుకుంటారు. అయితే కొన్ని 50 ఏళ్ల వయస్సులో కూడా ఇందులో చేరేందుకు అర్హత పొందవచ్చు. అయితే నిబంధనలు, షరతులకు లోబడి ఇది ఉంటుంది. కేవలం కొన్ని వర్గాలవారు మాత్రమే ఈ ప్రయోజనం పొందవచ్చు.

వడ్డీ రేటు ఎంత ఉందంటే..?

పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ సిబ్బంది 50 ఏళ్ల వయస్సు నుంచే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీములో పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టవచ్చు. స్వచ్చంత పదవీ విరమణ, ప్రత్యేక స్వచ్చంధ పదవీ విరమణ నిబంధనల ప్రకారం పదవీ విరమణ చేసినవారికి ఇది వర్తిస్తుంది. ఇక 60 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ఉద్యోగం చేస్తున్నా ఈ పథకంలో చేరవచ్చు. తమ కోసం లేదా జీవిత భాగస్వామి కోసం ఈ అకౌంట్‌ను తెరవొచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్ వడ్డీ వార్షిక రేటు 8.2 శాతంగా ఉంది.

ఎంతవరకు డిపాజిట్ చేయవచ్చు..?

సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ అకౌంట్(SCSS)లో కనీసం రూ.వెయ్యి డిపాజిట్ నుంచి పెట్టుబడి స్టార్ట్ చేయవచ్చు. గరిష్టంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మెచ్యూరిటీ పీరియడ్ ఐదేళ్లు ఉంటుంది. ఆ తర్వాత మూడేళ్ల వరకు పొడిగించుకోవచ్చు. ప్రతీ ఆర్ధిక సంతవ్సరానికి ఒకసారి వడ్డీ చెల్లిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి జాయింట్ అకౌంట్ తెరిచి అయినా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. ఇక ఇన్‌కమ్ ట్యాక్స్ సెక్షన్ 80సీ ప్రకారం పన్ను మినహాయింపు ఉంటాయి. ముందుగానే డబ్బులు ఉపసంహరించుకోవాలంటే పెనాల్టీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీపై శ్లాబుల ప్రకారం ట్యాక్స్ పడుతుంది. క్లెయిమ్ చేయని వడ్డీపై అదనపు వడ్డీ లభించదు. అంటే మీరు సంపాదించిన వడ్డీ ఆటోమేటిక్‌గా  దానంతట అదే తిరిగి పెట్టుబడి పెట్టబడదని గమనించాలి. పదవీ విరమణ కోసం డబ్బులు పొదుపు చేసుకోవాలనేవారికి ఇది బెస్ట్ స్కీముగా కొనసాగుతోంది. ఈక్విటీ మార్కెట్ల రాబడులతో పోల్చినప్పుడు ఈ స్కీమ్ ద్వారా వచ్చే రాబడి విలువ పెరుగుతుంది. ఖాతా తెరవాలనుకుంటే పన్ను, ముందస్తు విత్ డ్రా పెనాల్టీల గురించి అవగాహన కలిగి ఉండటం మంచిది.

Follow Us