AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. దీపావళికి ముందే పెరిగిన సిలిండర్ల ధరలు.. కొత్త రేట్లు ఇవే..

Gas Cylinder Price: దేశంలో మరోసారి గ్యాస్ సిలండర్ల ధరలు పెరిగాయి. దీపావళి పండక్కి ముందే ధరలు పెరిగి షాకిచ్చాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ల ధరలను కేంద్రం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇంట్లో ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్ల ధరలను యథాతధంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది.

గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. దీపావళికి ముందే పెరిగిన సిలిండర్ల ధరలు.. కొత్త రేట్లు ఇవే..
Gas Cylinder Prices
Venkatrao Lella
|

Updated on: Nov 01, 2026 | 8:13 AM

Share

దీపావళి పండక్కి ముందే దేశ ప్రజలకు షాక్ తగిలింది. ఎల్పీజీ గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. దేశంలో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలు స్వల్పంగా పెరిగాయి.  అయితే వంటిట్లో ఉపయోగించే గృహ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే రెస్టారెంట్లు, ఆహార దుకాణాల్లో ఉపయోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు ఈ నెలలో కూడా పెరిగాయి. గత కొద్ది నెలలుగా వాణిజ్ సిలిండర్ల ధరలు పెరుగుతూనే వస్తోన్నాయి. అదే బాటలో ఈ నెలలో కూడా పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో రెస్టారెంట్లు,  హోటళ్లు, ఫుడ్ సెంటర్ల యజమానులకు ఇది బ్యాడ్‌న్యూస్‌గా చెప్పవచ్చు. ప్రతీ నెల ఒకటో తేదీన కొత్త గ్యాస్ ధరలను చమురు సంస్థలు ప్రకటిస్తూ ఉంటాయి. ధరల్లో మార్పులు చేస్తూ ఉంటాయి.  నవంబర్ 1 వచ్చేయడంతో గ్యాస్ ధరల్లో మార్పులు చేశాయి చమురు సంస్థలు. ఈ పెరుగుదల తర్వాత ఎల్పీజీ గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయంటే చూద్దాం.

కొత్త ఎల్పీజీ గ్యాస్ ధరలు ఇవే..

దేశంలో ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరిగాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదు చేసుకుంది. ఢిల్లీలో వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే 19 కిలల సిలిండర్ ధర  రూ.10 పెరిగి రూ.2,820కి చేరుకోగా.. ముంబైలో రూ.10 పెరిగి రూ.2,774.50 పలుకుతోంది. ఇక కోల్‌కతాలో రూ.10 పెరిగి రూ.2,964కు చేరుకోగా.. చెన్నైలో రూ.11.50 పెరిగి రూ.2,994.50కు లభిస్తోంది. ఇక హైదరాబాద్‌లో రూ.3065 వద్ద ఉంది. హైదరాబాద్‌లో వాణిజ్య సిలిండర్ ధర అత్యంత ఖరీదైనదిగా ఉండగా.. ముంబైలో అత్యల్ప ధర ఉంది. ఇక కోల్‌కతాలో అత్యధిక పెరుగుదల కొనసాగుతోంది. కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడంతో పండక్కి స్వీట్ల ధరలపై ప్రభావం చూపనుంది. స్వీట్ల ధరలు పెరిగే అవకాశముంది. ఇది ప్రత్యక్షంగా సామాన్యులపై ప్రభావం చూపనుందని చెప్పవచ్చు.  దీపావళి అంటేనే దేశ ప్రజలందరూ జరుపుకునే అతి పెద్ద పండుగ.  ఈ పండుగ వచ్చిందంటే స్వీట్లు ఒకరికొరు పంచుకుంటూ ఉంటారు. అలాగే ఇంట్లో రకకరాల పిండి వంటకాలు చేసుకుంటూ ఉంటారు.

గృహ సిలిండర్ల ధరలు ఇవే..

ఇక గృహ అవసరాల కోసం ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు యథాతధంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఈ సిలిండర్ ధర రూ.994 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడలో రూ.966గా ఉంది. కాగా ఆగస్ట్ నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఆహార పదార్థాల ధరలు పెరుగుతున్నాయి. ఎల్‌నివో ప్రభావంతో ఆహార ధరలు పెరుగుతుండగా.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు కూడా కారణమవుతున్నాయి.

Follow Us