AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగులోనూ RRB స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు రాత పరీక్ష.. ఎంపిక విధానం ఇదే!

రైల్వేలో స్టేషన్ మాస్టర్ ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియపై పూర్తి అవగాహన అవసరం. RRB స్టేషన్ మాస్టర్ నియామకంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT), సర్టిఫికెట్ల పరిశీలన, వైద్య పరీక్షలు కీలక దశలుగా ఉంటాయి. పరీక్ష విధానం, నెగెటివ్ మార్కింగ్, ప్రాంతీయ భాషల్లో పరీక్ష రాసే అవకాశం వంటి వివరాలను తెలుసుకుని అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను ప్రణాళికాబద్ధంగా కొనసాగించాలి..

తెలుగులోనూ RRB స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు రాత పరీక్ష.. ఎంపిక విధానం ఇదే!
RRB Station Master Selection Process
Srilakshmi C
|

Updated on: Nov 01, 2026 | 8:10 AM

Share

హైదరాబాద్‌, నవంబర్ 1: రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBs) స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి నిర్వహించే ఎంపిక ప్రక్రియలో అభ్యర్థులు పలు దశలను అధిగమించాల్సి ఉంటుంది. ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), ఆ తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT) నిర్వహిస్తారు. అనంతరం ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా తుది ఎంపిక చేపడతారు.

మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ

స్టేషన్ మాస్టర్ పోస్టులకు అభ్యర్థులను కింది దశల ద్వారా ఎంపిక చేస్తారు..

  • మొదటి దశ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT).
  • రెండో దశ: కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT).
  • చివరి దశ: ధ్రువపత్రాల పరిశీలన (Document Verification), వైద్య పరీక్షలు (Medical Examination).

మొదటి దశ CBTలో అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే తదుపరి దశ అయిన CBAT నిర్వహిస్తారు. అన్ని దశల్లో అర్హత సాధించిన వారిని నిబంధనల ప్రకారం తుది ఎంపికకు పరిగణనలోకి తీసుకుంటారు.

ఇవి కూడా చదవండి

CBT పరీక్ష విధానం ఎలా ఉంటుంది?

స్టేషన్ మాస్టర్ పోస్టుల మొదటి దశ CBT పరీక్ష మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు (MCQs) ఉంటాయి. ప్రశ్నలు వివిధ అంశాల నుంచి అడుగుతారు. బేసిక్ సైన్స్, మ్యాథమెటిక్స్, అనలిటికల్ ఎబిలిటీ నుంచి 60 ప్రశ్నలు, లాజికల్ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలు, మెంటల్ రీజనింగ్ నుంచి 20 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయిస్తారు. అభ్యర్థులు అన్ని విభాగాలపై సమానంగా దృష్టి పెట్టి ప్రిపరేషన్ కొనసాగించాలి. అభ్యర్థుల సౌలభ్యం కోసం CBT పరీక్షను ఇంగ్లిష్, హిందీతో పాటు తెలుగు సహా మొత్తం 13 ప్రాంతీయ భారతీయ భాషల్లో రాసే అవకాశం కల్పిస్తారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తమకు అనుకూలమైన పరీక్ష భాషను ఎంచుకోవచ్చు.

ఈ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు కోత విధిస్తారు. కాబట్టి అభ్యర్థులు ప్రశ్నలను జాగ్రత్తగా చదివి సమాధానాలు గుర్తించాలి. తెలియని ప్రశ్నలకు అనవసరంగా సమాధానాలు గుర్తించడం వల్ల మార్కులు కోల్పోయే అవకాశం ఉంది. స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు మొదటి నుంచే అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించాలి. ముఖ్యంగా గణితం, రీజనింగ్, జనరల్ సైన్స్ అంశాలను నిరంతరం సాధన చేయాలి. CBTతో పాటు తదుపరి నిర్వహించే ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు కూడా ముందుగానే సిద్ధం కావడం మంచిది. అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, పరీక్ష విధానం, మార్కుల వివరాలను పరిశీలించి ప్రిపరేషన్ కొనసాగించాలి.

Follow Us