AP Municipal Elections 2026: ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. లైవ్ వీడియో
Andhra Pradesh Municipal Elections 2026: ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.. 13 కార్పొరేషన్లు సహా మొత్తం 92 పట్టణాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే.. నామినేషన్ల సమయంలోనే పలు చోట్ల ఏకగ్రీవాలు కావడంతో ఆయా స్థానాలు మినహా.. మిగతా ప్రాంతాల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి.
ఏపీలో తొలి దశలో 13 నగరపాలక సంస్థలు, 79మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వాటిలో 17 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల ఛైర్‌పర్సన్ స్థానాలతో పాటు, 8చోట్ల మొత్తం వార్డుల్ని కూడా ఏకగ్రీవంగా గెలుచుకున్న కూటమి.. పురపోరులో ఆరంభంలోనే ఆధిపత్యం సాధించింది. రాష్ట్రంలో 92 పట్టణ స్థానిక సంస్థల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 10,262 మంది పోటీ చేస్తున్న ఈ ఎన్నికల్లో 99.36 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఓటు వేసేందుకు వెళ్లేటప్పుడు ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఓటరు కార్డు లేని వారు.. మిగతా కార్డుల్లో ఏదైనా ఒకదానిని తీసుకెళ్లొచ్చు..
రాష్ట్ర వ్యాప్తంగా 11,705 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 99లక్షల 36 వేల 14 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మున్సిపల్ ఎన్నికలకు 36,351 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. 671 అత్యంత సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. 1,233 సమస్యాత్మక కేంద్రాల్లో పోలీసుల మోహరించారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర పోలీస్ నిఘా. ఎన్నికల పర్యవేక్షణకు 1,543 రూట్ మొబైల్ బృందాలు, 111 స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర 4,655 మంది పోలీసులు పహారా ఉన్నారు.
విజయవాడ, చీరాల, నెల్లిమర్ల, సాలూరుల్లో మేయర్, ఛైర్‌పర్సన్ పోస్టులకు త్రిముఖ పోటీ నెలకొంది. కార్పొరేషన్‌ల మేయర్లు, మున్సిపాలిటీలు, నగరపంచాయతీల ఛైర్ పర్సన్లకు ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు జరుగుతున్నాయి.
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
నీటిలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించిన పోలీసులు!
