అందాల ప్రియాంకాకు హిట్స్ వచ్చినా.. ఆఫర్స్ మాత్రం తక్కువే .. 

Rajeev 

06  march 2026

ప్రియాంక మోహన్.. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తోంది ఈ అమ్మడు.

పేరుకు మలయాళ నటినే అయినా పక్కింటమ్మాయిలా కనిపిస్తూ తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరవవుతోంది.

తన అందం, అభినయంతో టాలీవుడ్ లో క్రమంగా స్టార్ హీరోయిన్ గా ఎదుగుతోంది. కెరీర్ ప్రారంభంలోనే నాని, శర్వానంద్ లాంటి ప్రామిసింగ్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. 

నాని నటించిన  సరిపోదా శనివారంతో బ్లాక్ బస్టర్ మూవీని ఖాతాలో వేసుకుంది ప్రియాంక అరుళ్ మోహన్. 

ఈ అందాల తార  ఇటీవలే ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఆమె రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

మొన్నటివరకు గ్లామర్ డోస్ కు దూరంగా ఉండే ఈ అమ్మడు ఇప్పుడు తన బ్యూటీ ఫుల్ ఫొటోలతో అభిమానులను మెప్పిస్తుంది