మెదక్ జిల్లా రామాయంపేటలోని స్నేహ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని రేవతి పరీక్ష రాస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. కళాశాల యాజమాన్యం వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి సమాచారం అందించింది. వైద్య బృందం ఘటనాస్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించింది. పరీక్షల ఒత్తిడి కారణంగానే ఈ ఘటన జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.