గ్యాస్ సిలిండర్ల కొరత, డెలివరీ ఆలస్యంపై వ్యాప్తి చెందుతున్న అసత్య ప్రచారాలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి, డొమెస్టిక్ వినియోగదారులకు గ్యాస్ అందుబాటులో ఉంచేందుకు సిలిండర్ బుకింగ్‌ల మధ్య 25 రోజుల గ్యాప్‌ను తప్పనిసరి చేసింది. ఖాళీ సిలిండర్ లేకుండా బుక్ చేయవద్దని సూచించింది. వాస్తవ డెలివరీ సమయం 1-2 రోజులు మాత్రమే.